Pawan Kalyan పై వర్మ సంచలన కామెంట్స్: ఆ సినిమా ఫ్లాప్ అంటూ.. తారక్, బన్నీ, చరణ్‌లపై కూడా!

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తనదైన చిత్రాలతో అప్పటి వరకూ టాలీవుడ్‌లో ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించాడు.

దీంతో దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఇప్పుడీ దర్శకుడు తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. సున్నితమైన అంశాలతో వివాదాస్పద సినిమాలు చేయడంతో పాటు తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వర్మ.. పవన్‌ కల్యాణ్‌పై సంచలన ట్వీట్స్ చేశాడు. అలాగే, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కూడా లాగాడు. ఆ సంగతులు మీకోసం!

పంథాను మార్చి పొలిటికల్ మూవీస్

పంథాను మార్చి పొలిటికల్ మూవీస్

ఆరంభంలోనే రాంగోపాల్ వర్మ క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో ఆయన పంథాను మార్చుకున్నాడు. కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న కథలపై ఫోకస్ చేస్తూ ‘రక్త చరిత్ర' నుంచి వరుసగా ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', ‘పవర్ స్టార్' వంటివి తెరకెక్కించాడు.

 కుర్రకారును రెచ్చగొట్టే సినిమాలతో

కుర్రకారును రెచ్చగొట్టే సినిమాలతో

ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ తరచూ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ‘క్లైమాక్స్', ‘నగ్నం', ‘డేంజరస్', ‘జీఎస్టీ' వంటి హాట్ హాట్ మూవీలను రూపొందించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ద్వారా విడుదల చేస్తున్నాడు. వీటితో పాటు సున్నితమైన అంశాలపైనా సినిమాలు తీస్తున్నాడు.

వివాదాలతో సావాసం... విమర్శలతో

వివాదాలతో సావాసం... విమర్శలతో

గొప్ప గొప్ప సినిమాలతో రాంగోపాల్ వర్మ దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. తద్వారా ఎంతో మందికి శత్రువులా మారాడు. దీంతో తరచూ అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.

పవన్ కల్యాణ్‌పై వర్మ వరుస ట్వీట్స్

పవన్ కల్యాణ్‌పై వర్మ వరుస ట్వీట్స్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ.. తాజాగా తన ట్విట్టర్‌లో పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశాడు. ‘పవన్ గారూ.. ఆరోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు అని ఈ ట్విట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు. ఫలితం చూసారు. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా.. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చేయండి.. పవర్ ప్రూవ్ చేయండి' అంటూ చెప్పుకొచ్చాడు.

భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ రియాక్షన్స్

భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ రియాక్షన్స్

మరో ట్వీట్‌లో రాంగోపాల్ వర్మ పుష్పకు భీమ్లా నాయక్‌కు సంబంధం చెబుతూ ట్వీట్ చేశాడు. అందులో ‘పుష్ప మూవీనే అంత చేస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేయకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్‌కు ఆన్సర్ చేయలేము' అంటూ కామెంట్స్ చేశాడు.

ఆ రెండు సినిమాలతో పోలుస్తూనే

ఆ రెండు సినిమాలతో పోలుస్తూనే

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ గురించి రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ చేశాడు. అందులో ‘ఇంటీరియర్ ఆంధ్రాలో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కల్యాణ్ గారూ' అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వోడ్కా తాగి పెట్టా.. ఇప్పుడు మాత్రం

వోడ్కా తాగి పెట్టా.. ఇప్పుడు మాత్రం

అల్లు అర్జున్‌పై గతంలో చేసిన ట్వీట్లు అన్నీ మందు తాగి చేశానని చెప్పాడు రాంగోపాల్ వర్మ. ఒక ట్వీట్‌లో ‘అల్లు అర్జున్ గురించి నేను గతంలో చేసిన ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైంలో పెట్టాను. కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నేను కాఫీ తాగే సమయంలోనే పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్‌నెస్‌కు అర్థం చేసుకోండి' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu
ఎన్టీఆర్, చరణ్‌ను లాగుతూ ట్వీట్స్

ఎన్టీఆర్, చరణ్‌ను లాగుతూ ట్వీట్స్

రాంగోపాల్ వర్మ చేసిన మరో ట్వీట్‌లో ‘ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగును పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్‌ను పాన్ ఇండియాకు తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చేయండి' అంటూ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X