twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు హీరోలు, ఆ హీరోయిన్లపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు: ప్రకాశ్ రాజ్ ఎంతో మంది ఆడవాళ్లకు అంటూ!

    |

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నిక ఒకటి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో ప్రకాశ్ రాజ్ హాట్ టాపిక్ అవుతున్నారు. దీనికి కారణం ఆయనపై నాన్ లోకల్ అన్న అపవాదు ఉండడమే. తాజాగా దీనిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు, హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

    ప్రకాశ్ రాజ్ దూకుడు... ప్యానెల్‌ కూడా

    ప్రకాశ్ రాజ్ దూకుడు... ప్యానెల్‌ కూడా

    త్వరలో జరగనున్న 'మూవీ ఆర్టిస్టు అసోషియేషన్' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలు పోటీ పడుతున్నారు. వీళ్లందరూ అప్పుడే పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వీరిలో ప్రకాశ్ రాజ్ అందరి కంటే ముందున్నారు. అప్పుడే తన కార్యచరణను ప్రకటించిన ఆయన.. ఏకంగా 27 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను అనౌన్స్ చేశారు.

     ప్రకాశ్ రాజ్‌పై నెగెటివ్ టాక్.. ఆర్జీవీ ఇలా

    ప్రకాశ్ రాజ్‌పై నెగెటివ్ టాక్.. ఆర్జీవీ ఇలా

    ఈ సారి పోటీలో నిలిచిన నలుగురు ప్రముఖుల్లో ప్రకాశ్ రాజ్‌పై నెగెటివ్ టాక్ వస్తుంది. దీనికి కారణం ఆయన నాన్ లోకల్ అన్న పేరు ఉండడమే. దీన్నే చాలా మంది హైలైట్ చేసి తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దీనిపై స్పందించాడు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

     అతడు నాన్ లోకల్ అయితే వాళ్లంతా?

    అతడు నాన్ లోకల్ అయితే వాళ్లంతా?

    ప్రకాశ్ రాజ్ విషయంలో జరుగుతోన్న రచ్చ స్పందించిన రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో 'కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే.. మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా? ఎలా? ఎలా? ఎలా?' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి మంచి స్పందన వస్తోంది.

     ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలపైనా కామెంట్

    ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలపైనా కామెంట్

    ఈ వ్యవహారంలోకి సీనియర్ హీరోలను లాగిన రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో మరో పోస్ట్ పెట్టాడు. అందులో 'కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే.. గుడివాడ నుంచి చెన్నై వెళ్లిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నుంచి మద్రాస్ బయల్దేరిన మోహన్ బాబు గారు లోకలా' అంటూ ప్రశ్నించాడు.

     హీరోయిన్లు, మైకేల్ జాక్సన్ పేర్లను వాడి

    హీరోయిన్లు, మైకేల్ జాక్సన్ పేర్లను వాడి

    ప్రకాశ్ రాజ్ వ్యవహారంలో మరింత చొరవ చూపించిన రాంగోపాల్ వర్మ డ్యాన్సింగ్ లెజెండ్ మైకేల్ జాక్సన్‌ను కూడా వదిలి పెట్టలేదు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్.. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్.. బ్రూస్‌లీ నాన్ లోకల్.. రాముడు సీత కూడా నాన్ లోకల్.. వీళ్లంతా నాన్ లోకల్ అయితే ప్రకాశ్ రాజ్ కూడా నాన్ లోకల్' అని పేర్కొన్నాడు.

     దేశమే నాలుగు సార్లు శాలువా కప్పింది

    దేశమే నాలుగు సార్లు శాలువా కప్పింది

    విలక్షణ నటనతో ఎన్నో సార్లు ఉత్తమ నటుడిగా నిలిచిన ప్రకాశ్ రాజ్ గొప్పదనాన్ని వివరిస్తూ రాంగోపాల్ వర్మ వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చాడు. మరో పోస్టులో 'ప్రకాశ్ రాజ్ నటనను చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే, మీరంతా ఆయనను నాన్ లోకల్ అని పిలుస్తారా? ఇది భారతదేశ ప్రతిష్టకే వ్యతిరేకం' అంటూ చెప్పుకొచ్చాడు.

    ఆడవాళ్లకు పని కల్పించే వాడు అలానా?

    ఆడవాళ్లకు పని కల్పించే వాడు అలానా?

    మరో ట్వీట్‌లో 'ముప్పై ఏళ్లుగా ప్రకాశ్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి, పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ, తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా' అంటూ రాసుకొచ్చాడు. ఇలా వరుస ట్వీట్లతో ప్రకాశ్ రాజ్‌ను తన మద్దతును తెలియజేశాడీ సంచలన దర్శకుడు వర్మ.

    English summary
    Tollywood Sensational Director Ram Gopal Varma Very Active in Social Media. Now He Respond on MAA Elections 2021 in Twitter. And Also He Comments on Prakash Raj Character.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X