twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంపీ రఘురామరాజును అందుకే కొట్టారు.. సీక్రెట్ రివీల్ చేసిన రాంగోపాల్ వర్మ

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి రాజకీయపరమైన అంశంపై ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎంపీ రఘురామకృష్టంరాజు (RRR) మధ్య చోటుచేసుకొన్న వివాదంపై తనదైన శైలిలో ట్వీట్లు చేశారు. RRRపై జరిగిన దాడి గురించి కామెంట్ చేస్తూ..

    Recommended Video

    RGV ట్వీట్ల పరంపర, Allu Sirish పై సెటైర్, Anandayya కి Nobel ఇవ్వాలంటూ || Filmibeat Telugu
     ఏపీ ప్రభుత్వంపై విమర్శలు

    ఏపీ ప్రభుత్వంపై విమర్శలు

    గత రెండు వారాలుగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్రభుత్వం పనితీరు, ఆ పార్టీ నేతలను, సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ మీడియాలో రఘురామ రాజు లైవ్స్ పెడుతూ అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. దాంతో కొందరు నేతలు RRRపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. దాంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తరలించడం వివాదాస్పదమైంది.

    దారుణంగా లాఠీలతో దాడి చేయడం

    దారుణంగా లాఠీలతో దాడి చేయడం

    ఏపీ ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చే విధంగా రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారంటూ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై దారుణంగా లాఠీలతో దాడి చేశారనే విషయం మరింత వివాదాస్పదమైంది. ఒక ఎంపీని దారుణంగా కొడుతారా అంటూ RRR కుటుంబం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఎంపీకి బెయిల్ ఇవ్వడం జరిగిపోయింది.

     పోలీసులంటే అలాంటి వారు.

    పోలీసులంటే అలాంటి వారు.

    ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ స్పందిస్తూ... లాక్‌డౌన్ సమయంలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారంతా RRR కేసును స్పూర్తిగా తీసుకొని కేసులు ఫైల్ చేయవద్దు. ఎందుకంటే పోలీసులు మన సొంత తల్లుల వంటి వాళ్లు. మీ మితిమీరిన ప్రవర్తనను వల్ల కొట్టలేదు. కేవలం వారు మీపై ప్రేమ చూపించడానికి కొడుతారు అంటూ వర్మ కామెంట్ చేశారు.

     అర్ధం చేసుకొని మూర్ఖులు అంటూ

    అర్ధం చేసుకొని మూర్ఖులు అంటూ

    పోలీసుల చేతిలో ఎవరైనా దెబ్బలు తిని.. వారు RRR లాంటి కేసులు ఫైల్ చేయాలని అనుకొనే వాళ్లకు నేను ఇచ్చే ఒక సలహా ఇవ్వాలనుకొంటున్నాను.. పోలీసులు లాఠీ దెబ్బలు.. ప్రేమతో వేసిన దండలు లాంటివి. వాళ్లు తిట్టే తిట్లు మంచి కోరివేసే మంత్రాల లాంటివి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మూర్ఖులు పోలీసుల చేతిలో తన్నులు తినడం, లాఠీ దెబ్బలు, వారిచే ముద్దులు పెట్టుకోవడానికి అర్హులు అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్లు చేశారు.

    లాక్‌డౌన్‌లో ఇలా ఎక్కడైనా కొడుతారా?

    కరోనావైరస్ లాక్‌డౌన్ నిబంధనలు పాటించన వారిపై పోలీసులు లాఠీలతో కొట్టడం లాంటి సంఘటనలు భారత్‌లో కాకుండా ప్రపంచంలోని మిగితా దేశాల్లో ఎక్కడైనా జరిగాయా? రఘురామ రాజు కాలివేళ్లు విరిగేలా కొట్టినట్టు రుజువైతే.. పోలీసులపై సుప్రీంకోర్టు జడ్జీలు యాక్షన్ తీసుకొంటారా? నాకు విషయం సరిగా తెలియక అడుగుతున్నాను అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు.

    రాజ్యాంగం అలా చెప్పలేదా?

    ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని, అలాంటి వారి నేరాలకు సంబంధించిన రుజువులను సమర్పిస్తే వారికి శిక్ష వేయాలా వద్దా అనే విషయాన్ని రాజ్యాంగం విపులంగా చెప్పలేదా? ఈ విషయంలో నేను తప్పుగా ఆలోచిస్తే RRR జడ్జీలును నన్ను ఎడ్యుకేట్ చేయాలి అంటూ వర్మ కామెంట్ చేశారు.

    హాట్ టాపిక్‌గా RRR వ్యవహారం..

    హాట్ టాపిక్‌గా RRR వ్యవహారం..

    తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశమైన రఘురామరాజు కేసు వ్యవహారం కోర్టులో ఉండగా రాంగోపాల్ వర్మ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలపై పోలీసుల దాడి అంశాన్ని RRR కేసుతో పోల్చడం.. దానిని ఆధారంగా చేసుకొని ట్వీట్లు ఎందుకు చేశారనే విషయం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    English summary
    Ram Gopal Varma, Raghu Rama Krishnam Raju, RRR, రాంగోపాల్ వర్మ, రఘురామకృష్ణంరాజుDirector Ram Gopal Varma sensational comments on Raghu Rama Krishnam Raju case. He tweeted that, My sincere request to all people who got beaten up by police is not to take inspiration from RRR case and file cases on police, because police people are like ur own mothers ..They don’t beat u out of arrogance, but they beat u out of pure love.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X