కత్తితో ఎప్పుడు పొడుస్తాడా అని ఎదురుచూస్తున్నా.. రానా పాత్రపై ఆర్జీవీ కామెంట్స్!

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదుల చేశారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో రానా చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా పాత్రని ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

భయపడుతున్న చంద్రబాబు

భయపడుతున్న చంద్రబాబు

బుధవారం రోజు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర యూనిట్ రానా చంద్రబాబు పాత్రకు సంబందించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోని తనకు అనుకూలంగా ఎడిట్ చేసుకున్న వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి చంద్రబాబు భయంతో ఇస్తున్న రియాక్షన్ ఇది అని ట్వీట్ చేశాడు. రానాపై ప్రశంసలు కురిపించాడు కూడా. రానా చంద్రబాబు పాత్రలో చాలా ఒరిజినల్ గా కనిపిస్తున్నాడని అన్నారు.

కత్తితో ఎప్పుడు పొడుస్తాడా అని

బాలయ్య ఎన్టీఆర్ పాత్రల, రానా చంద్రబాబు పాత్రలో ఉన్న ఎన్టీఆర్ మహానాయకుడు పోస్టర్ ని పోస్ట్ చేస్తూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ పోస్టర్ లో బాలయ్య వెనుక రానా ఉన్నాడు. రానా లుక్ అదిరిపోయింది. అతడి జేబులో నుంచి కత్తి తీసి బాలయ్య వెనుక ఎప్పుడు పొడుస్తాడా అని ఎదురుచూస్తున్నా అంటూ వర్మ ట్వీట్ చేశాడు. చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో వర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో అసలు కథ

లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో అసలు కథ

రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత మొదలయ్యే సంఘటనలని, వారి మధ్య అనుబంధాన్ని ఆర్జీవీ హైలైట్ చేయబోతున్నారు. లక్ష్మీస్ ఎన్టీర్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో 8 మిలియన్ల వ్యూస్ కు చేరువైంది. ఈ చిత్రం కోసం తాను ఎన్టీఆర్ నివాసంలో పనిచేసిన వంట మనుషులని కూడా కలిశానని, ఎంతో వాస్తవికతతో రూపొందిస్తున్నాని వర్మ అంటున్నారు.

చంద్రబాబు పరోక్షంగా

చంద్రబాబు పరోక్షంగా

ముఖ్యమంత్రి చంద్రబాబు టిడిపి నేతలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు ఎన్టీఆర్ చరిత్రని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. నేతలంతా ఎన్టీఆర్ చరిత్రని ప్రజలకు తెలిసేలా చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా వర్మ రానా పాత్ర గురించి సెటైర్లు వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X