»   » వర్మ ఆశ్చర్యం: ఈ ఐడియాలు బాహుబలి, షోలే రైటర్లకు కూడా రావు బాబోయ్!

వర్మ ఆశ్చర్యం: ఈ ఐడియాలు బాహుబలి, షోలే రైటర్లకు కూడా రావు బాబోయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగే సంఘటనలను చూపించబోతున్నారు.

అయితే చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుండటంతో.... వర్మ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీ నాయకులు ఆయనపై మాటల దాడి ప్రారంభించారు. అయితే వారికి తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ.... తన సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచుకుంటున్నాడు ఆర్జీవీ.

షాకైన వర్మ...

షాకైన వర్మ...

అయితే టీవీపీ ఎమ్మెల్యే అనిత వర్మపై విమర్శలు చేసే క్రమంలో.... ఆమె మాట్లాడిన మాటలు వర్మను సైతం షాక్‌కు గురి చేశాయి. మీకు వచ్చిన ఐడియాలు షోలే రైటర్లు సలీమ్- జావేద్, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కు కూడా వచ్చి ఉండవు అంటూ సెటైర్ వేశారు. అనితకు వర్మ ఇచ్చిన సమాధానాలు క్రింది విధంగా ఉన్నాయి.

RGV Officially Announced His Upcoming Movie "Lakshmi's NTR"
టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు

వర్మ సమాధానం: అనిత గారు బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.

వర్మ సమాధానం: అనితగారు ఈ సినిమా బయోపిక్ కాదు..కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితం లో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసిన టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.

వర్మ సమాధానం: అనితగారు ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందునుంచి విని విని విసుగెత్తిపోయాను

టీడీపీ ఎమ్మెల్యే అనిత: రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..

టీడీపీ ఎమ్మెల్యే అనిత: రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే..వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..

వర్మ సమాధానం: లోగుట్టు పెరుమాళ్ళకెరుక

టీడీపీ ఎమ్మెల్యే అనిత: చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు..జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..

వర్మ సమాధానం: అనితగారు మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు 🙏🙏

టీడీపీ ఎమ్మెల్యే అనిత: మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమజాహితo

టీడీపీ ఎమ్మెల్యే అనిత: మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమజాహితo

వర్మ సమాధానం: ఆహా క్లాప్సు విజిల్స్ !!!💐💐💐

English summary
Director Ram Gopal Varma strong counter to TDP MLA Anitha over Laxmi's NTR biopic movie.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu