For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ నా కొడుకు అంటూ.. అల్లు అరవింద్‌ను, అర్నాల్డ్‌ను కలిపి ఉతికేసిన రాంగోపాల్ వర్మ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తం గర్వించే దర్శకుడిగా పేరొందాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అయితే, ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం ఆయన వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతోంది. తరచూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ట్వీట్లు, కామెంట్లు చేయడం.. వాటి వల్ల ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ కారణంగానే ఈ డైరెక్టర్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యంగ్ హీరో అల్లు శిరీష్‌పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  సెన్సేషనల్ మూవీలతో వస్తున్నాడు

  సెన్సేషనల్ మూవీలతో వస్తున్నాడు

  కొన్నేళ్లుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. గతంలో ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. చాలా విజయాలను అందుకుని దేశ వ్యాప్తంగా పేరొందాడు. కానీ, కొన్నేళ్లుగా ఆర్జీవీ వెరైటీగా ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంచలనం అయిన అంశాలను ప్రధానాంశంగా తీసుకుని సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

  గొప్ప వాళ్ల బయోపిక్స్ అంటూ తీస్తూ

  గొప్ప వాళ్ల బయోపిక్స్ అంటూ తీస్తూ

  రాంగోపాల్ వర్మ ఇటీవలి కాలంలో రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల కథలతో సినిమా రూపొందిస్తున్నాడు. మాజీ మంత్రి పరిటాల రవి జీవితం ఆధారంగా తీసిన 'రక్త చరిత్ర' నుంచి వరుసగా 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి సినిమాలు తీశాడు. ఇక, గత ఏడాది పవన్ కల్యాణ్‌ రాజకీయాలపై 'పవర్ స్టార్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

  సొంతంగా ఓటీటీ.. వర్మ సూపర్ ప్లాన్

  సొంతంగా ఓటీటీ.. వర్మ సూపర్ ప్లాన్

  మిగిలిన దర్శకుల సినిమాలతో పోలిస్తే రాంగోపాల్ వర్మ తీసే సినిమాలకు సెన్సార్ చిక్కులు ఎదురవుతున్నాయి. అంతేకాదు, ఆయన తీస్తున్న చిత్రాలపై కొందరు కోర్టులను కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ సరికొత్తగా ఆలోచించాడు. ఇందులో భాగంగానే 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకున్నాడు.

  అన్నీ అలాంటి చిత్రాలే చేస్తున్నాడు

  అన్నీ అలాంటి చిత్రాలే చేస్తున్నాడు

  కరోనా ప్రభావంతో థియేటర్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రియులు అందరూ ఓటీటీ ఫ్లాట్‌ఫాంల వైపు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాంగోపాల్ వర్మ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 'క్లైమాక్స్', 'నగ్నం', 'పవర్ స్టార్', 'దిశ', 'మర్డర్', 'డేంజరస్', 'కరోనా వైరస్' వంటి వినూత్నమైన చిత్రాలను తీస్తూ ఓటీటీలో విడుదల చేస్తున్నాడు.

   ఎప్పుడూ అందులోనే... రచ్చ రచ్చ

  ఎప్పుడూ అందులోనే... రచ్చ రచ్చ

  రాంగోపాల్ వర్మ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆయన తరచూ ఏదో ఒక పోస్టును పెడుతూనే ఉంటాడు. సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసే ఈ దర్శకుడు.. వివాదాలకు కేంద్ర బిందువులా అవుతున్నాడు. దీంతో ఎంతో మందికి శత్రువులా మారిపోతూ వార్తల్లో నిలుస్తున్నాడు.

  శిరీష్ సిక్స్ ప్యాక్... వర్మ సంచలనం

  శిరీష్ సిక్స్ ప్యాక్... వర్మ సంచలనం

  బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ ఇటీవల తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో వదిలాడు. వీటికి నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో ఇవి తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి. ఇక, తాజాగా వాటిలోని ఒక ఫొటోను షేర్ చేశాడు రాంగోపాల్ వర్మ. అంతేకాదు, దీనిపై సంచలన ట్వీట్ చేశాడు.

  Recommended Video

  Tollywood హీరో పై Prashant Neel ఫోకస్ | NTR 31 | Salaar | KGF Chapter 2 || Filmibeat Telugu
  అల్లు శిరీష్‌ ఆయన కొడుకు కాదు

  అల్లు శిరీష్‌ ఆయన కొడుకు కాదు

  అల్లు శిరీష్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ 'ఈ నా కొడుకు కెనాన్ ద బార్బేరియన్ హీరో ఆర్నాల్డ్ కొడుకు కాదు. అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీకు జోహార్' అంటూ రాసుకొచ్చాడు. ఇందులో 'ఆ నా కొడుకు' అని వాడడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో 'శిరీష్ ఎవరో మాకు తెలుసు.. నువ్వు ఎవరి కొడుకు' అంటూ రిప్లై ఇస్తున్నారు.

  English summary
  Director Ram Gopal Varma Very Active in Social Media. Now he shred Young Hero Allu Sirish Six Pack Photo and Sensational Comments on him in Twitter.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X