రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి: ప్రభాస్‌పై షాకింగ్ పోస్ట్ చేసిన రాంగోపాల్ వర్మ

Recommended Video

ప్రభాస్‌పై షాకింగ్ పోస్ట్ చేసిన రాంగోపాల్ వర్మ

ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన.. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సినిమాలు తీయడంలోనూ.. సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ ఆయన అందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కొద్దిరోజుల క్రితం ఆయన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో వచ్చారు. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాతో వస్తున్నారు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అంతేకాదు ఇది వివాదాస్పదం కాదని చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నానన్నాడు. దీంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు.

 కులాల ప్రస్తావన

కులాల ప్రస్తావన

ఈ క్రమంలోనే వర్మ కులాల ప్రస్తావన తీసుకు వస్తున్నాడు. తరచూ ఏదో ఒక కులాన్ని ప్రస్తావిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నాడు. వీటికి తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు జోడిస్తున్నాడు. దీంతో వర్మ కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. దీంతో అందరూ ఆయనపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస పోస్టులు చేస్తున్నాడు ఈ సంచలన దర్శకుడు.

క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటూ ప్రకటన

క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటూ ప్రకటన

క్యాస్ట్ ఫీలింగ్‌పై పోస్టులు చేస్తున్న క్రమంలో తనకు తానై ఓ విషయాన్ని వెల్లడించాడు. ‘నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అలా ఉండటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. క్యాస్ట్ ఫీలింగ్ అనేది బెటర్ ఫీలింగ్. ఎవరి కులం మీద వాళ్లకున్న ప్రేమను కుల గజ్జి అనే ఒక పరమ నీచ అసహ్యమైన పేరుతో వర్ణించేవారికి ఇదే నా సమాధానం' అని రామ్ గోపాల్ వర్మ వాయిస్‌తో ఉన్న సాంగ్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ప్రభాస్ పేరును కూడా వాడాడు

వర్మ తన సినిమా ప్రమోషన్ కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరును కూడా వాడుకున్నాడు. ‘ప్రభాస్ నా కులమే. అతడి సాహో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. నా కులం వాడు కాబట్టి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని ఒక పోస్ట్ చేశాడు. అలాగే, ‘నా క్యాస్ట్ ఫీలింగ్ పాట.. నా కులమైన ప్రభాస్ సినిమాలోని సాంగ్‌తో కలిసి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది' అని మరో పోస్ట్ పెట్టాడు.

 రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి

రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి

ఇక, తాజాగా రాంగోపాల్ వర్మ.. ప్రభాస్ కులాన్ని ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ‘భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ప్రభాస్ సినిమా సాహోతో కూడిన ఫ్లెక్సీలు రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి. వీటిని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ పెట్టాడు. ఇకపై, ఇంకెన్ని పోస్టులు పెడతాడు..? ఎవరెవరిని వాడుకుంటాడు..? అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X