For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిచ్చికుక్కల కన్నా హీనం.. మహిళా డాక్టర్ హత్యపై రామ్‌గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

  |

  హైదరాబాద్ లోని షాద్‌నగర్‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్‌ భయానక హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దుర్ఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ పెద్ద ఎత్తున సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ వరుస ట్వీట్స్ చేశాడు. వివరాల్లోకి పోతే..

  పిచ్చికుక్కల కన్నా హీనం.. వర్మ ఫస్ట్ రియాక్షన్

  ''వెటర్నరీ డాక్టర్‌ను అత్యంత కిరాతకంగా హత్యచేసిన వారి మానసిక స్థితి పిచ్చికుక్కల కన్నా హీనం. అలాంటి పిచ్చికుక్కలకు ఎంత పెద్ద శిక్ష వేసినా అది తక్కువే అవుతుంది. వాళ్ళను హింసించి చంపాలని డిమాండ్‌ చేయటం కూడా వృథా. దానికి బదులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి'' అని వర్మ మొదటి ట్వీట్ చేశాడు.

  నిందితుల మెంటల్‌ కెపాసిటీ.. వర్మ కామెంట్

  ''ఏ రేపిస్ట్‌ కూడా గత అనుభవాల నుంచి నేర్చుకునేది ఏదీ ఉండదు. 2012లో జరిగిన నిర్భయ ఘటన నుంచి ఇప్పటి వరకు మనకు ఇదే స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే వాళ్లకు గత అనుభవాల దృష్ట్యా ఇకముందు భయపడాలి అనేంత మెంటల్‌ కెపాసిటీ ఉండదు. ఓ పిచ్చి కుక్క గతంలో మరో పిచ్చి కుక్కపై జరిగిన దాడిని చూసి ఏం నేర్చుకుంటుంది'' అని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ.

  నా పాయింట్ అదే అంటూ లాజిక్ మాట్లాడిన వర్మ

  అంటే తన ఉద్దేశం వెటర్నరీ డాక్టర్‌‌ని హత్యచేసిన దుర్మార్గలను పిచ్చికుక్కలు అని వదిలి పెట్టాలని కాదని అన్నాడు వర్మ. రేపిస్ట్‌లను సమాజానికి చేసిన జబ్బులా భావించి ఆ రోగాన్ని ఎలా తగ్గించాలన్న విషయంలో శాస్త్రీయంగా పరిశోదన జరపాలనేదే తన పాయింట్ అన్నాడు. అప్పుడే మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించగలమని ఈ సందర్భంగా ఓ ఉదాహరణ చెప్పాడు. ''ఒక పామును ముక్కలుగా నరికితే మరో పాము మన దగ్గరికి రాకుండా ఉండదు కదా. ఎందుకంటే వాటికి అంత ఆలోచనా శక్తి ఉండదు కాబట్టి'' అంటూ తనదైన శైలిలో వర్మ కామెంట్ చేశాడు.

  సాధ్యంకాని డిమాండ్స్ చేసే బదులు, రేపిస్ట్‌లను..

  ''నిందితులను చంపేయాలి, తగలబెట్టాలి లాంటి సాధ్యంకాని డిమాండ్స్ చేసే బదులు, రేపిస్ట్‌లను ప్రశ్నించాలి. ఇలాంటి ప్రశ్నలను టీవీల్లో ప్రసారం చేయాలని కోరాలి. సైకియాట్రిస్ట్‌లు, సోషల్‌ సైంటిస్ట్‌లు వాళ్లను ప్రశ్నిచటం ద్వారా వారికి వారు తమలో అలాంటి రాక్షస నేరప్రవృత్తి ఎలా వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓ నేరం జరగగానే ఆ నేరస్థుడిని పట్టుకొని శిక్షించి మరో నేరం జరిగే వరకు ఈ సంఘటను మరిచిపోవటం కరెక్ట్ కాదు'' అన్నాడు వర్మ.

  #CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?

  అది నేరం జరగకుండా ఆపలేదు

  ''శిక్ష పడుతుందన్న భయం నేరం జరగకుండా ఆపలేదు. ప్రతీ నేరస్తుడు తను దొరకనన్న ధైర్యంతోనే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతాడు. ఒక వేళ దొరుకుతా అనే భయం ఉంటే ఎవడూ నేరం చేయడు. వాళ్ళంతట వాళ్లు అంత దుర్మార్గంగా ఎలా ఆలోచించారు. ఎందుకు ఆలోచించారు అని తెలుసుకుంటే భవిష్యత్తులో రేపిస్ట్‌లను ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది'' అంటూ వర్మ కామెంట్ చేశాడు.

  English summary
  Priyanka Reddy muder is trending around country. On this issue Tollywood Celebrities reacted and putting their condolence. Now Ram Gopal Varma Reacted on Priyanka Reddy Murder
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X