చుట్టూ ఇంగ్లీష్ పాపలు.. వాళ్ళతో పవన్ కళ్యాణ్ వేషాలు! రామ్ గోపాల్ వర్మ సంచలనం

Recommended Video

Ram Gopal Varma Sensational Tweet On Pawan Kalyan || అసలు వర్మ ఏం చుపించబోతున్నాడు ?

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్‌ని పట్టుకొచ్చి తన తాజా సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో పెట్టేశాడు. ఇప్పటికే ఆ యాక్టర్ లుక్ బయటకు వదిలి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. మరో పోస్టర్‌తో సంచలనం సృష్టించాడు. వివరాల్లోకి పోతే..

పవన్‌పై వర్మ ట్వీట్ల వర్షం.. అవకాశం దొరికితే చాలు

పవన్‌పై వర్మ ట్వీట్ల వర్షం.. అవకాశం దొరికితే చాలు

పవన్‌ కళ్యాణ్ వీరాభిమానని అని చెబుతూనే పవన్‌‌పై దారుణమైన విమర్శలు చేస్తున్నాడు వర్మ. గతంలో 'అజ్ఞాతవాసి' సినిమా సమయంలో ట్వీట్లతో పవన్‌ ని విమర్శించిన ఆయన.. పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాక కూడా వదలడం లేదు. ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూ తన అస్త్రాలు ఒక్కొక్కటిగా విసురుతున్నాడు వర్మ.

పవన్ కళ్యాణ్‌పై స్పెషల్ ఫోకస్

పవన్ కళ్యాణ్‌పై స్పెషల్ ఫోకస్

ఈ నేపథ్యంలోనే తన తాజా సినిమా ద్వారా పవన్ కళ్యాణ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. ఇటీవలే చిరంజీవి పుట్టిన రోజు నాడే.. అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఓ యాక్టర్‌ ఫోటోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆయన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని అర్థం చేసుకున్నారు జనం.

పవన్ వర్గాలకు షాకిస్తూ..

పవన్ వర్గాలకు షాకిస్తూ..

తాజాగా దానికి కొనసాగింపుగా మరో పోస్టర్ రిలీజ్ చేసి పవన్ అభిమానులకు, జనసేన వర్గాలకు షాకిచ్చాడు వర్మ. చుట్టూ ఇంగ్లీష్ పాపలు, మధ్యలో పవన్ కళ్యాణ్‌ని పోలిన సినిమా నటుడు.. పైగా పార్టీ గుర్తులు.. ఇలా ఓ పోస్టర్ డిజైన్ చేసి ట్విట్టర్‌లో వదిలాడు వర్మ. ఈ పోస్టర్ చూడగానే ఠకీమని పవన్ గుర్తొచ్చేలా ప్లాన్ చేశాడు వర్మ. దీంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అయింది.

 ఎవరినైనా పోలి ఉన్నట్టుగా అనిపిస్తే అది..

ఎవరినైనా పోలి ఉన్నట్టుగా అనిపిస్తే అది..

ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న నటీనటులు.. నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉన్నట్టుగా అనిపిస్తే అది యాధృచ్చిమే అంటూ ట్యాగ్ చేయడంతో ఈ పోస్టర్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. పవన్ అభిమానులు కొందరు విరుచుకు పడుతూ కామెంట్స్ పెడుతుండగా, ఇంకొందరు వర్మను సమర్థిస్తూ, ఆయన టాలెంట్ మెచ్చుకుంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

వర్మ, టెక్నిక్స్ ప్లే చేస్తున్నాడా..?

వర్మ, టెక్నిక్స్ ప్లే చేస్తున్నాడా..?

మొత్తానికైతే ఇదంతా చూస్తుంటే.. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ చాలా టెక్నిక్స్ ప్లే చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. సరైన టైమ్‌ని, సరిగ్గా క్యాచ్ చేసుకుంటూ వర్మ వెళుతున్న విధానం సినీ, రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో వర్మ సంచలనాలు ఎలా ఉంటాయనేది.

ఈ నెల 27న మరో సంచలనం

ఈ నెల 27న మరో సంచలనం

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు సంబంధించి.. ఇప్పటికే కొన్ని పోస్టర్స్, పాటలు విడుదల చేసి షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటల 36 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X