ఆ నిర్మాత చుట్టూ అమ్మాయిలే.. ఫోటోతో సహా బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. సెన్సేషనల్ ఇష్యూ
సంచలనాలకు మారుపేరైన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తనకేదనిపిస్తే అది నిర్మొహమాటంగా ఆన్‌లైన్ వేదికల ద్వారా నెటిజన్ల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో వర్మ పెడుతున్న పోస్టులు కాంట్రవర్సీకి కేంద్రంగా మారుతున్నాయి. తాజాగా ఓ నిర్మాత గురించి చెప్పకనే చెబుతూ ఓ ఫోటో షేర్ చేశాడు వర్మ. వివరాల్లోకి పోతే..

కాంట్రవర్సీ లేదు అంటూనే వర్మ..
ఏ మాత్రం కాంట్రవర్సీ లేదు అంటూనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన సినిమా నిర్మాతపై తనదైన స్టైల్ కామెంట్ చేసి తానేంటో మరోసారి నిరూపించుకున్నారు వర్మ.
నిర్మాత గురించి వివాదాస్పదంగా వర్మ కామెంట్
‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అజయ్ మైసూర్. టాలీవుడ్‌లో ఇదే అతనికి మొదటి సినిమా. అయితే అతని గురించి వర్మ
వివాదాస్పద ట్వీట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అందమైన అమ్మాయిల మధ్య స్టైల్‌గా కారు మీద కూర్చున్న అజయ్ మైసూర్ ఫొటో షేర్ చేస్తూ ఆయనను డాన్ బిల్జరియాన్‌తో పోల్చాడు వర్మ.
దీని వెనుక అసలు కథ ఇది
అజయ్ మైసూర్‌ని డాన్ బిల్జరియాన్‌తో పోల్చడం వెనుక పెద్ద కథే ఉంది. హాలీవుడ్ నటుడు డాన్ బిల్జెరియన్ పెద్ద జల్సా రాయుడు. చుట్టూ అమ్మాయిలు, జూదం లాంటి అలవాట్లతో ఎప్పుడూ లావిష్ లైఫ్‌ను అనుభవిస్తూ ఉంటాడాయన. బీచుల్లో చిట్టి పొట్టి డ్రెస్సులేసుకున్న సుందరాంగులతో ఎంజాయ్ చేస్తుండటం డాన్ బిల్జెరియన్ స్టైల్. సో.. ఈ లెక్కన అజయ్ మైసూర్‌ని కూడా అలాంటి వ్యక్తియే అని అంటున్నాడన్నమాట వర్మ.

టెక్నిక్ ప్లే వర్మ.. అందుకే ఇలా చేశాడా?
దీంతో వర్మ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ కూడా వర్మ లాజిక్ ఉపయోగించారనే టాక్ వినిపిస్తోంది. తన నిర్మాత పేరును నలుగురి నోళ్ళలో నానేలా చేయడం, ఆయన గురించి చర్చించునేలా చేయడం కోసమే వర్మ ఈ టెక్నిక్ ప్లే చేశాడని చెప్పుకుంటున్నారు జనం. ఏది ఏమైనా వర్మ తీరే వేరు కదండీ.

సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టేలా
ఇక 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విషయానికొస్తే.. ఆయన విడుదల చేస్తున్న అప్‌డేట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఆయన ఈ సారి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తుండగా.. వర్మ సహ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











