'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ డేట్ ప్రకటించిన 24నిమిషాల్లో.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!
Recommended Video

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేస్తానని వర్మ ప్రకటిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో తన చిత్రాన్ని పోల్చుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. సాధారణంగానే వర్మని కాస్త ఎక్కువగా ప్రాజెక్ట్ చేస్తే మీడియా.. ఈ వివాదంతో ఇంకా ఎక్కువగా చూపిస్తోంది. తాజాగా వర్మ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
24 నిమిషాల్లో
తాజాగా రాంగోపాల్ వర్మ ట్విటర్ లో స్పందిస్తూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ విడుదల ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలపై ఆధారపడి ఉంటుంది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర విడుదల తేదీని ప్రకటించిన 24 నిమిషాల్లో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేస్తానని ఆర్జీవీ తెలిపాడు. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఇలానే చేయమని తనని ఆదేశించారని రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎన్టీఆర్ కథానాయకుడు రిజల్ట్
ఎన్టీఆర్.. తన సొంత కొడుకు కథానాయకుడు చిత్రాన్ని కాకుండా భార్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మాత్రమే ఆదరిస్తారు అని చెప్పడానికి కథానాయకుడు రిజల్టే నిదర్శనం అని వర్మ తెలిపాడు. ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్ మధ్య పోటీని ఎన్టీఆర్ స్వాగతిస్తారు అంటూ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే ఎన్టీఆర్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని వివిధ పాత్రల లుక్స్ కూడా విడుదల చేస్తూ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

తుదిదశలో మహానాయకుడు
బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రానికి 50 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్ర షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రం అయినా రాణిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం క్రిష్, బాలయ్య తుది దశ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఆ అంశంతోనే
వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాలపై ఉంటుందని వర్మ ఇదివరకే తెలిపారు. ఇక బాలయ్య నటిస్తినా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ సినీరంగానికి సంబందించిన అంశాలని కథానాయకుడు చిత్రంలో చూపించారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో ఆయన రాజకీయ జీవితానికి సంబంధించిన అంశాలు ఉంటాయి.


Click it and Unblock the Notifications











