ఎన్టీఆర్‌పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్స్: క్యాసినో వెనుక ఉన్నది ఆయనే.. వీడియో షేర్ చేసి మరీ!

రాంగోపాల్ వర్మ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఈ దర్శకుడు కొంత కాలంగా ఎన్నో రకాలుగా హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రతి విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో వివాదాలకు కారణం అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో అంశాల గురించి స్పందిస్తున్నాడు. దీంతో తరచూ వార్తల్లోనే నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోన్న గుడివాడ క్యాసినో వివాదంపై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తున్నాడు.

తాజాగా ఇందులోకి నందమూరి తారక రామారావును లాగుతూ ఈ సంచలన దర్శకుడు ట్వీట్లు చేశాడు. దీంతో ఈ ఇష్యూ మరింత హైలైట్ అవుతోంది. ఇంతకూ వర్మ ఏం ట్వీట్లు చేశాడు? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

గుడివాడలో గోవా తరహా క్యాసినో

గుడివాడలో గోవా తరహా క్యాసినో

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఏ రేంజ్‌లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఏపీలో పండుగ సీజన్‌లో కోడి పందాలు, జూదం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ సారి కృష్ణా జిల్లాలోని గుడివాడలో గోవా తరహాలో క్యాసినో సెంటర్లను ఏర్పాటు చేయడం సంచలనం అయింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పెద్ద వివాదం అయింది.

ఏపీ మంత్రి వల్లే అని ప్రచారాలు

ఏపీ మంత్రి వల్లే అని ప్రచారాలు

గుడివాడలో క్యాసినో సెంటర్లు ఏర్పాటు చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కొడాలి నాని హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి ప్రతిపక్షం దీన్ని బాగా హైలైట్ చేయడంతో పాటు సదరు మంత్రిపై విమర్శలు చేస్తోంది. దీంతో స్వయంగా నాని స్పందించి.. క్యాసినో సెంటర్ల వ్యవహారంలో తన హస్తం ఉందని నిరూపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానన్నారు.

స్పందించిన వర్మ.. వరుస ట్వీట్లు

స్పందించిన వర్మ.. వరుస ట్వీట్లు

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న వివాదాలపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వేగంగా స్పందిస్తున్నాడు. ఇందులో భాగంగానే క్యాసినో సెంటర్ల గురించి మాట్లాడుతూ.. ‘గుడివాడ అభివృద్ధికి పాటుపడుతోన్న మంత్రి కొడాలి నానికి నా ధన్యవాదాలు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విమర్శలను పట్టించుకోవద్దు' అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు.

అభివృద్ధి చేస్తున్నావంటూ పంచ్

అభివృద్ధి చేస్తున్నావంటూ పంచ్

రాంగోపాల్ వర్మ దీన్ని అంతటితో వదలకుండా.. ‘గుడివాడను లండన్, లాస్‌వెగాస్‌, పారిస్‌ లాంటి దేశాల లిస్టులో ఉంచేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనను తప్పకుండా మెచ్చుకోవాలి'.. ‘గోవాలో ఉన్న క్యాసినో సంస్కృతిని ఏపీలోని గుడివాడకు తీసుకొచ్చిన నానిని ఎందుకు విమర్శిస్తున్నారు?' అంటూ పంచ్‌లు వేస్తూ ట్వీట్లు చేసేశాడు.

వివాదంలోకి ఎన్టీఆర్‌ను లాగేశాడు

వివాదంలోకి ఎన్టీఆర్‌ను లాగేశాడు

విమర్శలు ప్రతి విమర్శలతో గుడివాడ క్యాసినో వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలి ట్వీట్లతో రెచ్చిపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంలోకి సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు'ను లాగుతూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

ఆయనే క్యాసినో తీసుకొచ్చాడని

ఆయనే క్యాసినో తీసుకొచ్చాడని

తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ‘యమగోల' సినిమాలోని గుడివాడ వెళ్లాను అనే స్పెషల్ సాంగ్‌ను షేర్ చేశాడు. దీనికి ‘గుడివాడలో క్యాసినో ఎన్టీ రామారావు పర్యవేక్షణలో 1977లోనే మొదలైంది' అంటూ విచిత్రమైన అంశాన్ని లేవనెత్తాడు. అంతేకాదు, ‘నేను మొదటిసారి జయమాలిని ద్వారా గుడివాడ క్యాసినో గురించి విన్నాను' అంటూ చమత్కరించాడు.

Recommended Video

Tamil Actor Dinesh Speech At Kinnerasani Trailer Launch Event | Filmibeat Telugu
ఆయననే అందరూ ప్రశ్నించాలని

ఆయననే అందరూ ప్రశ్నించాలని

మరో ట్వీట్‌లో వర్మ ‘క్యాసినోను ముందుగా ఎన్టీఆరే అనుమతించారు కాబట్టి టీడీపీ వాళ్లు ఆయననే ప్రశ్నించాలి. ఒకవేళ టీడీపీ వాళ్లు మంత్రి కొడాలి నాని ప్రశ్నించాలి అనుకుంటే.. ఆయన కంటే ముందే ఎన్టీఆర్‌ను డిమాండ్ చేయాలి. ఎందుకంటే తన సినిమాల్లో ఇలాంటి వాటిని అనుమతించింది ఆయనే కాబట్టి' అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేశాడు. ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X