విలన్‌గా.. దమ్మున్న మగాళ్లుగా మారండి.. అర్నబ్‌పైకి బాలీవుడ్‌ను రెచ్చగొట్టేలా వర్మ ట్వీట్లు

బాలీవుడ్‌లో ప్రముఖ హీరోలు, దర్శక, నిర్మాతలపై రిపబ్లిక్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుశాంత్ మరణం నేపథ్యంలో వరుసగా తన చానెల్‌లో డిబేట్లు పెడుతూ బాలీవుడ్ ప్రముఖులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లిక్ టెలివిజన్‌ను తన ప్రచారానికి బాగా వాడుకొంటున్నారు అని వర్మ సైటైర్లు వేశారు. మీడియాను పబ్లిసిటీకి వాడుకొంటున్న అర్నబ్‌పై సినిమా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో హల్ చేశారు. ఇంతకు వర్మ చేసిన ట్వీట్లు ఏమిటంటే..

నీ బండారం బయటపెడుతా

నీ బండారం బయటపెడుతా

హలో అర్నబ్ గోస్వామి.. నా సినిమాలపై నీవు రియాక్ట్ అవుతావో లేదో తెలియదు. కానీ నా టార్గెట్ ఆడియెన్స్ మాత్రం నీ కోసం మాత్రం వెళ్లరు. కానీ నీ ప్రొగ్రాం చూసే ప్రేక్షకులను మాత్రం నేను షేక్ చేసేలా సినిమా తీస్తాను. రిపబ్లిక్ టీవీలో నీ పబ్లిక్ ఫేస్‌ను ఎండగడుతాను అని వర్మ ట్వీట్ చేశారు.

నీవు ఏమనుకొన్నా సరే..

నీవు ఏమనుకొన్నా సరే..

అర్నబ్ గోస్వామి.. ఒకవేళ నా సినిమా చూసి చెత్త అనుకొన్న ఫర్వాలేదు. ఎందుకంటే నిన్ను నేను నా పబ్లిసిటీకి నా సినిమాలో వాడుకొంటున్నాను కాబట్టి నీ మాటలను స్వాగతిస్తాను అని వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాలీవుడ్ ప్రముఖులకు నాదో సలహా

బాలీవుడ్ ప్రముఖులకు నాదో సలహా

బాలీవుడ్ ప్రముఖులైన ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, మహేష్ భట్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇతర నటీనటులకు చివరగా ఓ సలహాను ఇవ్వదలచుకొన్నాను. మీరు మీ సినిమాల్లో ఎంతో మంది హీరోలను సృష్టించారు. మీరే హీరోలుగా మారారు. కానీ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్లకు మీరంత విలన్‌లా మారాల్సిన అవసరం ఉంది అంటూ వర్మ కామెంట్స్ చేశారు.

Recommended Video

#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
మిమల్ని రేపిస్టులుగా..

మిమల్ని రేపిస్టులుగా..

బాలీవుడ్‌లోని ఆదిత్య చోప్రా, కరణ్ జోహర్, మహేష్ భట్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో ఎంతో మందిని క్రిమినల్స్‌గా, రేపిస్ట్‌గా చిత్రీకరిస్తున్నారు. ఆయన దాడికి భయపడి దాచుకోకుండా.. మగాళ్లలా ముందుకు రండి అంటూ వర్మ రెచ్చగొట్టే విధంగా ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X