Don't Miss!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!
తెలుగు దర్శకుడిగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పటి వరకూ తెలుగు సినీ ఇండస్ట్రీలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ ఎన్నో జోనర్లలో గొప్ప గొప్ప సినిమాలను తెరకెక్కించాడు. దీంతో దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఇదంతా గతం మాత్రమే. ఇప్పుడీ దర్శకుడు తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. చిత్ర విచిత్రమైన సినిమాలు చేయడంతో పాటు తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేశాడు వర్మ. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అప్పుడు అలాంటివి.. ఇప్పుడు ఇలా
కెరీర్ ఆరంభంలో క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఆయన పంథాను మార్చుకున్నాడు. కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేస్తూ 'రక్త చరిత్ర' నుంచి వరుసగా 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్' వంటివి చేశాడు.
RRR Trailer: వకీల్ సాబ్‌ను దాటలేకపోయిన ఆర్ఆర్ఆర్.. ఇంకా పవన్ కంట్రోల్‌లోనే అరుదైన రికార్డు

అలాంటి చిత్రాలు కూడా చేస్తున్నాడు
రాంగోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో తరచూ రొమాంటిక్ చిత్రాలను కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'జీఎస్టీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకుని దాని ద్వారానే వీటిని విడుదల చేస్తున్నాడు.

ఎప్పుడూ వివాదాలే... విమర్శల వర్షం
ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలను రూపొందించి.. దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. తద్వారా తరచూ అతడిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంటోంది.
Ashu Reddy Pregnant: తల్లి కాబోతున్న అషు.. పిచ్చ కొట్టుడు కొట్టిన తల్లి.. అలా బయటకు వచ్చిన వీడియో

ఆరియానా, అషుతో వీడియోలు చేసి
రాంగోపాల్ వర్మ తరచూ అమ్మాయిలతో కనిపిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఇటీవలే ఆరియానా గ్లోరీతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇది అప్పట్లో సంచలనం అయింది. ఆ తర్వాత అషు రెడ్డితో కలిసి చాట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ఇద్దరితో వర్మ చేసిన చిట్ చాట్‌తో వాళ్లపైన కూడా భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ మధ్య అమ్మాయిలతోనే ఎక్కువగా
తాను పరిచయం చేసిన.. హైలైట్ చేసిన హీరోయిన్లతో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ కలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ వంటి వారితో ఆర్జీవీ తరచూ పార్టీలు చేసుకుంటూ ఉంటాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతూ రచ్చ రచ్చ చేస్తుంటాడు.
Janhvi Kapoor: శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ షో.. దారుణంగా చూపిస్తూ రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు

హీరోయిన్ స్నానం చేసే వీడియోను
రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి ఫేమస్ అయిన వారిలో అప్సరా రాణి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా స్నానం చేస్తోన్న ఓ వీడియోను షేర్ చేసింది. దీనికి ఫారెస్ట్ బాతింగ్ అనే క్యాప్షన్ పెట్టింది. దీన్ని తాజాగా రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
Recommended Video

సూర్యూడి కంటే హాట్‌గా ఉన్నావంటూ
అప్సరా రాణి ట్వీట్ చేసిన వీడియోలో ఆమె బికినీ ధరించి స్నానం చేస్తోంది. దాన్ని రీట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ 'వావ్.. నువ్వు సూర్యుడి కంటే ఎంతో హాట్‌గా ఉన్నావు. కానీ, ఫారెస్ట్ ఎక్కడ ఉంది' అంటూ ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయిపోయింది. ఫలితంగా అప్సరా రాణి బాత్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.