అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!
కెరీర్ ఆరంభంలో గొప్ప గొప్ప చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుని.. ఈ మధ్య కాలంలో మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ రచ్చ చేసే ఈయన.. ఎంతో మందిపై పోస్టులు పెడుతూ గొడవల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తరచూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలోని హీరోలపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాంగోపాల్ వర్మ.. అషు రెడ్డి ప్రైవేట్ ఫోటోను షేర్ చేస్తూ పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సంగతులు మీకోసం!

రూటు మార్చిన వర్మ.. అలా చిత్రాలు
కెరీర్ ఆరంభంలో క్రైమ్, లవ్, రొమాంటిక్, హర్రర్, థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి రాంగోపాల్ వర్మ అప్పుడెప్పుడో తన స్టామినాను దేశ వ్యాప్తంగా చాటి చెప్పుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన పంథాను మార్చుకున్నారు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి వివాదాస్పద సినిమాలను తీస్తున్నాడు.

ఎప్పుడూ వివాదాలతోనే సహవాసం
అప్పట్లో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి దేశమే గర్వించదగ్గ దర్శకుల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దూకుడైన వ్యవహార శైలితో ప్రతి అంశంపై స్పందించే ఆయన ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. తద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు, వాళ్ల ఫ్యాన్స్‌కు శత్రువులా మారాడు.

అషు రెడ్డితో మీటింగ్.. అలాంటి పోస్ట్
కొద్ది రోజుల క్రితం రాంగోపాల్ వర్మ.. బిగ్ బాస్ బ్యూటీ ఆరియానా గ్లోరీతో బోల్డుగా ఇంటర్యూ చేసిన విషయం తెలిసిందే. అందులో వీళ్లిద్దరి మధ్య పచ్చి పచ్చిగా సంభాషనలు జరిగాయి. దీంతో ఈ వీడియో కాస్తా సంచలనం అయింది. ఇక, ఇప్పుడు ఆర్జీవీ మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో మీటింగ్ పెట్టాడు. ఈ క్రమంలోనే విచిత్రమైన ఫొటోలను తీసి వాటిని పోస్ట్ చేస్తున్నాడు.

అషు రెడ్డితో మరో ఇంటర్వ్యూ అని
రాంగోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే అవుతోంది. అందుకే ఆయనతో కలిసిన ప్రతి ఒక్కరూ ఫుల్ ఫేమస్ అవుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ అషు రెడ్డితో కలిసి ఓ ఇంటర్వ్యూ చేశాడు. 'ఆర్జీవీ బోల్డ్ విత్ పవన్ కల్యాణ్ గర్ల్ అషు రెడ్డి' అనే పేరు మీద రాబోతున్న దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను ఈరోజు సాయంత్రం 6.09 గంటలకు విడుదల చేయబోతున్నారు.

పవన్ కల్యాణ్‌కు వర్మ శుభాకాంక్షలు
రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని తరచూ టార్గెట్ చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఆ కుటుంబానికి చెందిన హీరోలందరినీ విమర్శిస్తూ కామెంట్లు కూడా చేశాడు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తరచూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని రాంగోపాల్ వర్మ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.

అషు రెడ్డి ప్రైవేట్ ఫోలోను వాడేశాడు
ఈరోజు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని రాంగోపాల్ వర్మ బుధవారమే అడ్వాన్స్‌గా విషెస్ తెలియజేశాడు. ఇందుకోసం అషు రెడ్డి తన ప్రైవేటు భాగంలో వేసుకున్న పవన్ కల్యాణ్ పేరు టాటూకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు వర్మ. ఇందులో 'అషు రెడ్డి తరపున పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని రాసుకొచ్చాడు.
Recommended Video

అషు రెడ్డిని బుక్ చేసేసి దర్శకుడు
అషు రెడ్డి గతంలో షేర్ చేసిన టాటూ ఫొటోను ఇప్పుడు రాంగోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటోను ఎవరు తీశారంటూ చాలా మంది ఈ బిగ్ బాస్ బ్యూటీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కొన్ని కామెంట్లకు ఆమె స్వయంగా రిప్లైలు కూడా ఇచ్చింది. అయినప్పటికీ చాలా మంది వల్గర్ కామెంట్లు చేస్తూ అషు రెడ్డిని విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











