ఆ దర్శకుడిని పవర్ స్టార్ నిజంగానే కొట్టాడా.? సంచలనం అవుతోన్న ఆర్జీవీ పోస్ట్.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న వారిలో ప్రప్రథమంగా చెప్పుకునే పేరు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఆయన... కొన్నేళ్లుగా వివాదాస్పద చిత్రాలను రూపొందిస్తూ సంచలనం అవుతున్నాడు. అదే సమయంలో చాలా మందికి శత్రువుగా మారుతున్నాడు. అయినప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ టాలీవుడ్‌లో సంచలనం అవుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఏపీ పాలిటిక్స్‌పై రాంగోపాల్ వర్మ కన్ను

ఏపీ పాలిటిక్స్‌పై రాంగోపాల్ వర్మ కన్ను

క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్ ఇలా ఎన్నో జోనర్లలో సినిమాలు తీసి మెప్పించాడు రాంగోపాల్ వర్మ. అయితే, కొంత కాలంగా ఆయన సున్నితమైన రాజకీయాలపై బాగా ఫోకస్ చేశాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆర్జీవీ కన్ను పడింది. ఇందులో భాగంగానే ‘రక్త చరిత్ర', ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి చిత్రాలను తెరకెక్కించాడు.

సినిమాలకు అడ్డంకులు లేకుండా ప్లాన్

సినిమాలకు అడ్డంకులు లేకుండా ప్లాన్

కొన్నేళ్లుగా ఆర్జీవీ తీస్తున్న సినిమాలన్నీ వివాదాస్పదం అవుతుున్నాయి. అంతేకాదు, వాటిపై కొందరు కోర్టుల వరకు వెళ్తున్నారు. దీంతో ఆయన తీస్తున్న సినిమాల విడుదలకు బ్రేకులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై తన సినిమాలకు అలాంటి సమస్యలు రాకూడదని భావించిన ఆయన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు.

 అన్ని సినిమాలూ అందులోనే విడుదల

అన్ని సినిమాలూ అందులోనే విడుదల

లాక్‌డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకు బ్రేక్ పడింది. అయినప్పటికీ రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు మాత్రం విడుదల అవుతున్నాయి. దీనికి కారణం ఆయనకు సొంతంగా డిజిటల్ ఫ్లాట్‌ఫాం ఉండడమే. ఇప్పటికే ఆర్జీవీ తెరకెక్కించిన ‘క్లైమాక్స్', ‘నగ్నం' వంటి సినిమాలు డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే విడుదల అయిన విషయం తెలిసిందే.

 ‘పవర్ స్టార్‌'తో ఆర్జీవీ మరో సంచలనం

‘పవర్ స్టార్‌'తో ఆర్జీవీ మరో సంచలనం

ఇప్పటికే ఎన్నో వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించిన వర్మ... తాజాగా ‘పవర్ స్టార్' పేరిట మరో సినిమాను పట్టాలెక్కించాడు. రాజకీయ పార్టీని పెట్టి ఓటమి పాలైన సినీ హీరోకు చెందిన కథతో ఈ మూవీ రూపొందిస్తున్నట్లు ప్రకటించాడు. వాస్తవానికి ఈ మూవీ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తీస్తున్నదే అని అందరికీ తెలుసు. కానీ వర్మ మాత్రం దానికి అంగీకరించడం లేదు.

ఫొటోలు, క్యారెక్టర్లతో వర్మ హల్‌చల్

ఫొటోలు, క్యారెక్టర్లతో వర్మ హల్‌చల్

‘పవర్ స్టార్' మూవీ షూటింగ్ ప్రారంభం అయిందన్న విషయాన్ని తెలియజేసేందకు వర్మ.. సోషల్ మీడియాలో వర్కింగ్ స్టిల్స్ ఒక్కొక్కటిగా వదులుతున్నాడు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌లా ఉన్న నటుడితో పాటు చిరంజీవి గెటప్‌లో ఉన్న మరో వ్యక్తినీ చూపించాడు. వాళ్లతో పాటు రష్యన్ యువతి అని ఓ మహిళ ఫొటోనూ వదిలాడు. అలాగే, ఓ దర్శకుడి స్టిల్‌ను చూపించాడు.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
సంచలనం అవుతోన్న ఆర్జీవీ పోస్ట్.!

సంచలనం అవుతోన్న ఆర్జీవీ పోస్ట్.!

వరుస ఫొటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వర్మ.. తాజాగా వదిలిన స్టిల్‌తో సంచలనంగా మారారు. అందులో పవర్ స్టార్ పాత్రధారి.. టాలీవుడ్ డైరెక్టర్‌ను పోలిన వ్యక్తిని కొట్టినట్లు చూపించాడు. దీంతో పవర్ స్టార్ సదరు దర్శకుడిని నిజంగానే కొట్టాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, కొందరు మాత్రం అది వర్మ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X