ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలా? ఆ సీన్ ఫోకస్ చేస్తూ వర్మ సంచలనం...

Recommended Video

Lakshmi's NTR : Ram Gopal Varma Picturises Up The Family Scenes In Movie | Filmibeat Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెలుగులో మరో సంచలన, వివాదాస్పద సినిమాకు తెరతీయబోతున్న సంగతి తెలిసిందే. దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయనపై వెన్నపోటు చర్యలకు పాల్పడి అధికారం నుంచి దించడం వెనక ఎవరు ఉన్నారు? ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసిన కుటుంబ పరిణామాలు ఏమిటనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇప్పటికే వెన్నుపోటు, ఎందుకు? పాటలను విడుదల చేసి సినిమాపై అసక్తి పెంచిన వర్మ తాజాగా... కొన్ని సీన్లకుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.

ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలా?

ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలా?

తాజాగా వర్మ షేర్ చేసిన స్క్రీన్ షాట్ పరిశీలిస్తే... లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటరైన తర్వాత కుటుంబంలో గొడవలు మొదలైనట్లు? ఆమెపై ఏదో విషయంలో ఓ వ్యక్తి కోపగించుకుంటున్నట్లు అవగతమవుతోంది.

ఎవరా వ్యక్తి? అంటూ ఆసక్తి రేపిన వర్మ

ఎవరా వ్యక్తి? అంటూ ఆసక్తి రేపిన వర్మ

మరో ట్వీట్లో ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించగా.... పలువురు స్పందించారు. అతడు సీతయ్య... ఎవరి మాట వినడు అంటూ కొందరు సమాధానం ఇవ్వడం గమనార్హం. సీతయ్య ఎవరో తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హైప్ పెంచేస్తున్న వర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది వర్మ ఇంకా ప్రకటించక పోయినా... సినిమా ప్రమోషన్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. రోజూ ఏదో ఒక పోస్టుతో అందరిలోనూ ఈ చిత్రంపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఇప్పటికే లక్ష్మీ పార్వతి, ఎన్టీ రామారావు లుక్ విడుదల చేశారు. ఎన్టీఆర్ పాత్రను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడు పోషిస్తున్నారు. అయితే అతడి పేరు ఇంకా బయటకు రాలేదు. లక్ష్మి పార్వతి పాత్రను కన్నడ నటి యజ్ఞ శెట్టి పోషిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X