AI పాపనూ వదలని ఆర్జీవీ: ఏకంగా ఆమె కింద పార్టుపై చెయ్యేసి.. అది టెస్ట్ చేస్తున్నా అంటూ!
రాంగోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వెళ్తున్నాడు. నిత్యం తనదైన సోషల్ మీడియా పోస్టులతో పాటు అప్పుడప్పుడూ సున్నితమైన అంశాలపై సినిమాలు చేస్తూ కలకలం రేపుతున్నాడు. అదే సమయంలో అందమైన భామలతో కలసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అలాగే, సోషల్ మీడియాలో హీరోయిన్ల హాట్ హాట్ ఫొటోలను కూడా షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రాంగోపాల్ వర్మ ఎవరూ ఊహించని ఓ పిక్‌ను వదిలాడు. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని మీరే చూడండి!
అలాంటి చిత్రాలతో రచ్చ:సుదీర్ఘ ప్రయాణంలో రాంగోపాల్ వర్మ ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ రేంజ్‌కు కూడా చేరుకున్నాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'రక్త చరిత్ర', 'వంగవీటి', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు', 'పవర్ స్టార్' వంటివి తీస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు.

హాట్ మూవీలనూ తీశాడు:కొంత కాలంగా రాంగోపాల్ వర్మ వివాదాస్పద చిత్రాలను మాత్రమే కాదు.. హాట్ హాట్ మూవీలనూ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే అతడు 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'జీఎస్టీ', 'లడ్కీ', 'డేంజరస్' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో కొన్నింటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ద్వారా విడుదల చేసి మజాను పంచాడు.
జగన్ కోసం కొత్త వ్యూహం:సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న చిత్రమే 'వ్యూహం'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే.

ఎక్కువగా అమ్మాయిలతో:అనతి కాలంలోనే సినిమాలు పూర్తి చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య తాను హైలైట్ చేసిన హీరోయిన్లతో కలిసి రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ వంటి వారితో ఆర్జీవీ తరచూ పార్టీలు చేసుకుంటుంటాడు. అలాగే, అషు రెడ్డి, ఆరియానా వంటి వాళ్లతో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో బిజీ:సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ నిత్యం హైలైట్ అవుతున్నాడు.

అమ్మాయితో హాట్ ఫోజు:సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తరచూ అమ్మాయిల ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన ట్విట్టర్ పేజీలో ఓ అమ్మాయి బికినీ ఫొటోను వదిలాడు. ఇందులో ఆమె ప్యాంటీపై చేయి వేసి మరీ పట్టుకున్నాడు. అలాగే, ఆ బ్యూటీని నడుము దగ్గర గట్టిగా టచ్ చేస్తూ హగ్ చేసుకున్నాడు.

అసలు విషయం చెప్పి:అమ్మాయి బికినీ ఫొటోను షేర్ చేసిన రాంగోపాల్ వర్మ 'ఈమె నిజమైన అమ్మాయా? బొమ్మనా? అని చెక్ చేస్తున్నా. ఆఖరికి ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ARTIFICIAL INTELLIGENCE) ద్వారా తయారు చేసినది అని గుర్తించాను' అని చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు 'AI పాపను కూడా వదలవా వర్మ' అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











