twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య అడిగినా తీయను, వార్నింగ్స్ కామన్: వర్మ డేరింగ్ స్టేట్మెంట్

    ఎన్టీఆర్ బయోపిక్ గురించి వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పోర్షన్ మొత్తం ఉంటుందన్నారు.

    By Bojja Kumar
    |

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్న వర్మ పలమనేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన విషయాలు మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

    Recommended Video

    RGV Officially Announced His Upcoming Movie "Lakshmi's NTR"

    ఎన్టీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రపంచం ఆశ్చర్యపోయే స్థాయిలో నాయకుడిగా ఎదిగారు. దాని తర్వాత అందరికీ తెలిసిన కొన్ని కారణాల వల్ల చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసి, లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలు, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, వాటి నుంచి స్ఫూర్తి పొంది సినిమా తీయాలనే ఆలోచన వచ్చిందని వర్మ తెలిపారు.

    ఆయన జీవితం మహాభారతం, నేను తీసేది ఆ సంఘటనలే ఒక పర్వం

    ఆయన జీవితం మహాభారతం, నేను తీసేది ఆ సంఘటనలే ఒక పర్వం

    రామారావుగారి జీవితం ఓ మహాభారతం లాంటిది. ఆయన 71 సంవత్సరాల గొప్ప జీవితంలో ఎంతో జరిగి ఉంటుంది. దాన్ని రెండున్నర గంటల్లో బంధించలేం. అందుకే నేను చాలా ముఖ్యమైన ఘటనలనే తీసుకుని ఈ సినిమా మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు.

    వార్నింగ్స్ కామన్

    వార్నింగ్స్ కామన్

    వార్నింగ్‌ అనేవి కామన్. ప్రతీ సిగరెట్‌ ప్యాకెట్‌ మీద కూడా వార్నింగ్ ఉంటుంది. 50 సంవత్సరాల నుండి ఎన్నో వార్నింగ్స్ చూశాను. ఎవరు ఏం చేసినా, ఒకరికి నచ్చవచ్చు. మరొకరికి నచ్చకపోవచ్చు. ఇంకొకరికి చాలా బాగా నచ్చవచ్చు. మరొకరికి ఇంకా బాధాకరం కావచ్చు.... అంటూ వర్మ తనదైన సమాధానం ఇచ్చారు.

    ఓ పార్టీనో, వ్యక్తినో కించ పరిచే ఉద్దేశ్యం లేదు

    ఓ పార్టీనో, వ్యక్తినో కించ పరిచే ఉద్దేశ్యం లేదు

    నా సినిమా ద్వారా ప్రత్యేకంగా ఓ పార్టీనో, ఓ వ్యక్తినో కించ పరిచే ఉద్దేశం లేదు. ఈ విషయం ముందు నుండీ నేను క్లియర్ గా చెబుతున్నాను. ఇపుడు కూడా అదే విషయం చెబుతున్నాను. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజాలు చెప్పాలనుకుంటున్నాను అని వర్మ తెలిపారు.

    ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది

    ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది

    రామారావుగారు చాలా పెద్ద సెలబ్రిటీ. ఆయనపై సినిమా తీసే అధికారం, హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నేనే కాదు పది మంది.. పది రకాలుగా సినిమా తీయొచ్చు. పది దృక్కోణాల్లో తీయొచ్చు. పది వ్యూ పాయింట్‌లలో చేయొచ్చు. ఆయన జీవితాన్ని వేర్వేరుగా చూపించవచ్చు. అది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అంటూ వర్మ నొక్కి వక్కానించారు.

    బాలయ్య అడిగినా తీయను

    బాలయ్య అడిగినా తీయను

    నా ఉద్దేశంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం నేను ఎంచుకున్న కొన్ని విషయాలు ఎన్టీఆర్ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. వాటి కన్నా తక్కువ ప్రాధాన్యం ఉన్న వాటిని సినిమాగా తీయను. బాలకృష్ణ వచ్చి ఆయన తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వం వహించాలని కోరినా చేయను. నేను ఎన్టీఆర్‌ గురించి తీయబోయే సినిమా ఇదొక్కటి మాత్రమే అని వర్మ అన్నారు.

    లక్ష్మి పార్వతి వచ్చినప్పటి నుండి ఆయన తుది శ్వాస వరకు

    లక్ష్మి పార్వతి వచ్చినప్పటి నుండి ఆయన తుది శ్వాస వరకు

    నేను తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లో .... లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన తుదిశ్వాస విడిచే వరకూ చూపిస్తా. అంతకు ముందు జరిగింది అందరికీ తెలిసిందే. అందులో చెప్పేదేమీ లేదని వర్మ తెలిపారు.

    వైశ్రాయ్ హోటల్ ఘటన ప్రధానమని చెప్పను

    వైశ్రాయ్ హోటల్ ఘటన ప్రధానమని చెప్పను

    ఈ సినిమాలో వైశ్రాయ్ ఘటన ప్రధానాంశంగా ఉంటుందిని నేను అనను. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన నాటి నుంచి చనిపోయే వరకూ ప్రతీ ఘటన ఇందులో ఉంటుంది అని వర్మ తెలిపారు.

    English summary
    Ram Gopal Varma Shares Important Details About Ntr Biopic at Palamaneru press meet. “I am in the midst of research and a lot of work needs to be done. I cannot disclose more than what I have posted. Yes. The movie is likely to be released by the end of next year,” said the director about the status of the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X