అధికారం ఇస్తే.. మా తలపై కూర్చోకండి.. మంత్రి పేర్ని నానిపై రాంగోపాల్ వర్మ ప్రశ్నల వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ తగ్గింపు వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. సోమవారం రాత్రి ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ఏపీ సినిమాటోగ్రాఫర్ పేర్ని నానితో జరిగిన చర్చ తర్వాత ఆర్జీవి వరుస ట్వీట్లు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశ్నిస్తూ.. అనేక సవాళ్లను ట్విట్టర్‌లో విసిరారు. మంత్రి పేర్ని నానికి ట్వీట్స్ చేస్తూ..
Recommended Video

పేద ప్రజల కోసం టికెట్లు కొనండి
ద్వంద ధరల వ్యవస్థలో పరిష్కారం అనే సిద్దాంతం అనేది చర్చనీయాంశమైంది. సినిమా టికెట్ల విషయంలో నిర్మాతలు వారి సినిమాకు సంబంధించిన టికెట్లును వారి ఇష్టం వచ్చిన ప్రకారం అమ్ముకొంటారు. మీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయండి. ఆ టికెట్లను తక్కువ ధరకు పేద ప్రజలకు అందించండి. దాంతో నిర్మాతకు డబ్బు వస్తుంది. మీకు ఓట్లు రాలుతాయి అని రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు.

రేషన్ షాపుల మాదిరిగా థియేటర్లు తెరుస్తారా?
ప్రత్యేక పరిస్థితుల్లో ఒక వస్తువుకు ధరను తక్కువకు గానీ, ఎక్కువగానీ నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండవచ్చు. కానీ ఎలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ వాతావరణం ఉందో మీరు గమనించారా? అని ఆర్జీవి ప్రశ్నించారు. పేద ప్రజలను ఆదుకొనేందుకు రేషన్ షాపులు తెరిచి బియ్యం, చక్కెర లాంటివి తక్కువ ధరకు అందిస్తున్నారు. మీరు పేద ప్రజలకు వినోదాన్ని అందించేందుకు రేషన్ థియేటర్లు అందించే ఉద్దేశం ఉందా సార్ అని మరో ట్వీట్‌లో వర్మ ప్రశ్నించారు.

పేదలకు సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదు
మంత్రి పేర్ని నానికి మరో ప్రశ్న వేస్తూ.. పేద ప్రజలకు సినిమా అత్యవసరమని భావిస్తే.. మరిఎందుకు సబ్సిడీని ఇవ్వడం లేదు. వైద్య, విద్య సేవల కోస ప్రభుత్వం తమ ఖజానా నుంచి ఇస్తున్నట్టే సినిమా పరిశ్రమకు ఎందుకు ఇవ్వడం లేదు అని అన్నారు. సినిమా గానీ, ఇతర వస్తువుల ధరను నిర్ణయించే విషయంలో ప్రభుత్వం పాత్ర ఏమిటో చెప్పగలరా? మీరు నా ప్రశ్నలకు కచ్చితంగా సమాధానం ఇస్తారని నేను కోరుకొంటున్నాను అని వర్మ మరో ట్విట్‌లో ప్రశ్నించారు.

అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ అంటూ
సినీ హీరోల రెమ్యునరేషన్ గురించి ఏపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోల పారితోషికం గురించి మీ ప్రభుత్వంలోని గౌరవనీయులైన పెద్దలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. వారికి నిర్మాణ వ్యయం తీసివేయడం తప్పితే మరో విషయం గురించి అవగాహన లేనట్టు కనిపిస్తున్నది అనే విధంగా వర్మ ట్వీట్ చేశారు.

తల మీద కూర్చోకండి..
గౌరవనీయులైన సినిమాటోగ్రఫి మంత్రి నాని సార్.. హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతూ మీప్రభుత్వానికి అధికారం అప్పగించారు అనే విషయాన్ని అర్ధం చేసుకోవాలి. కానీ మీ ప్రభుత్వం మా గుండెల్లో గూడు కట్టుకొంటారనుకొంటే... అందుకు విరుద్ధంగా మీరు మా తలపైకి ఎక్కి కూర్చొనే ప్రయత్నం చేస్తున్నారు అని రాంగోపాల్ వర్మ సెటైర్ వేశారు.


Click it and Unblock the Notifications











