twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV Vs Perni Nani ప్రభుత్వ జోక్యం అవసరమా? రేటు పెంచితే బ్లాక్ మార్కెటింగా? పేర్ని నానిపై ఆర్జీవి ఘాటుగా

    |

    ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై మంత్రి పేర్ని నాని, దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య ఆసక్తికరమైన ట్విట్టర్ వార్ జరుగుతున్నది. సోమవారం ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో చర్చ జరిగిన తర్వాత ఉత్పత్తిదారుడు, వినియోగదారుడి సంబంధం గురించి చర్చిస్తూ.. ఏపీ మంత్రి పేర్ని నానిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో మంగళవారం ట్వీట్ల వర్షం కురిపించారు. ఒక వీడియోను కూడా రిలీజ్ చేసి పది ప్రశ్నలు సంధించాడు. ఈ క్రమంలో వర్మ ట్వీట్లకు వివరణ ఇస్తూ బుధవారం పేర్ని నాని సమాధానం ఇచ్చారు. అయితే పేర్ని నానికి వర్మ ఇచ్చిన ఆసక్తికరమైన సమాధానాలు ఏమిటంటే..

    Recommended Video

    AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu
    సినిమా పరిశ్రమలో విపరీత పరిస్థితి ఉందా?

    సినిమా పరిశ్రమలో విపరీత పరిస్థితి ఉందా?

    రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అంటూ పేర్నీ నాని చేసిన ట్వీట్‌పై రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. గవర్నమెంట్ జోక్యం అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో ఉంటుంది. బియ్యం, గోధుమ లాంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు లేదా ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు ప్రభుత్వ జోక్యం ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకుల్లో కానీ ఎక్కడ వచ్చిందండీ? అని పేర్ని నానిని వర్మ ప్రశ్నించాడు.

    డిమాండ్ సప్లై థియరీని తెలుసుకోండి..

    డిమాండ్ సప్లై థియరీని తెలుసుకోండి..

    దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో టికెట్ల రేట్ల పెంపు విధానం గురించి మీకు తెలుసో? తెలియదో? కానీ ఉదాహరణకు ముంబై, ఢిల్లీ నగరాలలో వీక్ డే బట్టి, థియేటర్‌ను బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ధర 75 రూపాయల నుంచి 2200 రూపాయల వరకూ డిమాండ్‌ను బట్టి మారుతుంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటూ పేర్ని నానికి వర్మ క్లారిటీ ఇచ్చారు.

    బ్లాక్ మార్కెటింగ్ అంటే..

    బ్లాక్ మార్కెటింగ్ అంటే..

    రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? మంత్రి లేవనెత్తిన ప్రశ్నకు రాంగోపాల్ వర్మ సమాధానం ఇస్తూ.. టికెట్ కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే పారదర్శకత మాత్రమే ప్రభుత్వాలకి అవసరం. .ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్‌కి తెలియకుండా చేస్తే క్రైమ్.. బహిరంగంగా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది? అని పేర్ని నానిపై ప్రశ్నించాడు.

    మీరు కాదు.. కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడు

    మీరు కాదు.. కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడు

    రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అని ప్రశ్నించిన నానికి వర్మ మరో జవాబు ఇస్తూ.. ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ను కొనేవాడుంటే 5 కోట్ల రూపాయలకు కూడా అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్‌కి, ఐడియాకి ఎలా వెల కడతారు?. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది నిరంతరంగా ఇంకా బెటర్‌గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా? కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు. ప్రభుత్వాలు నిర్ణయించవు అంటూ పరోక్షంగా పేర్ని నానిపై సెటైర్ వేశారు.

    అది దోచుకోవడం కాదు..

    అది దోచుకోవడం కాదు..


    ఇష్టానుసారం టికెట్ రేట్ పెంచుకోవడం బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. నీళ్ళు దొరకని పరిస్థితి తలెత్తినప్పడుు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు అది పరిస్థితిని దోచుకోవడం అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి .. కారు కావాలనే కోరికని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు. తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం అని వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

    అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం అంటూ

    అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం అంటూ

    తాను లేవనెత్తిన ప్రశ్నలకు చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా గౌరవంగా సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ నాని గారు....ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ.. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది అని దర్శకుడు రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

    English summary
    Ram Gopal Varma satires on Minister Perni nani over ticket rates issue in Andhra pradesh. In tthis occasion, Minister Perni Nani gives counter To Varma. Now, RGV gives sharp answer to Perni nani tweets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X