ఇడియట్.. వకీల్ సాబ్ జోలికొచ్చిన డైరెక్టర్ సాబ్.. వర్మ తీరుపై మెగా ఫ్యాన్స్ రచ్చ
వివాదాస్పద దర్శకుడు, విలక్షణ స్వభావి రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదు. సినిమాలే కాదు రియల్ లైఫ్, మాట తీరు, సోషల్ మీడియా ఎక్కడైనా ఆయన తీరే వేరు. జనం నోళ్ళలో నానే విషయం ఏదైనా వచ్చిందనే అక్కడ వాలిపోవడం వర్మకు హాబీ. ఈ బాటలోనే తాజాగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' జోలికొచ్చాడు వర్మ. దీంతో ఈ ఇష్యూ పెద్ద రచ్చకే దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది? వర్మ ఏమన్నాడు? వివరాల్లోకి పోతే..
Recommended Video


వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. పవర్ స్టార్ ప్రయాణం
రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రెండేళ్లు జనసేనానిగా జనంలో తిరుగుతూ న్యాయ పాలన కోసం పోరాడిన ఆయన.. ఇక ఈ వేసవిలో 'వకీల్ సాబ్' రూపంలో న్యాయ కోవిదుడుగా సిల్వర్ స్క్రీన్‌పై దర్శనమీయబోతున్నారు.

పవన్ కళ్యాణ్ రోల్.. పింక్ రీమేక్
హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాను తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 26వ సినిమాగా ఈ 'వకీల్ సాబ్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఫస్ట్‌లుక్ వైరల్.. ఎంటరైన వర్మ
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం మేర కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. ఇక ప్రమోషన్స్ కూడా వేగవంతం చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు నిన్న (సోమవారం) వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలారు. ఆ వెంటనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, పలువురు సెలబ్రిటీలు స్పందించడం చకచకా జరిగిపోయాయి. సరిగ్గా ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యాడు.

కొంతమంది ఇడియట్స్.. హాట్ ఇష్యూని క్యాచ్ చేస్తూ!!
హాట్ ఇష్యూని క్యాచ్ చేసుకుంటూ తనకు తాను, తనదైన ప్రమోషన్స్ చేసుకోవడంలో దిట్ట అయిన వర్మ.. ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. తనదైన శైలిలో పంచ్ వేస్తూ వకీల్ సాబ్, డైరెక్టర్ సాబ్ పోస్టర్ షేర్ చేశాడు. దీనిపై ‘‘నేను కొంతమంది ఇడియట్స్ గురించి ఆలోచించను.. ఇలాంటి ఇడియట్ పనులను చేయను'' అని ట్యాగ్ చేశాడు.
మెగా ఫ్యాన్స్ రచ్చ..
దీంతో వర్మ ట్వీట్ చూసిన మెగా అభిమానులు ఆయనపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ''మా పవన్ పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య'' అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు వర్మను గెలుకుతూ, ట్రోల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











