సెక్స్ కోసమే! దర్శకుడి భార్యతో వర్మ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, మహిళల పట్ల అతని ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో, సమాజం పట్ల అతని దృక్ఫథం ఎలా ఉంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వర్మ ఆలోచనలకు అద్దం పట్టే అతని పుస్తకం 'నా ఇష్టం' చదవితే ఆ విషయాలు అర్థమవుతాయి.
తాజాగా వర్మకు సంబంధించి...ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఓ విషయం బయటకు పొక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య, సింగర్, నటి సుచిత్రా కృష్ణ మూర్తి తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ 'డ్రామా క్వీన్' అనే పుస్తకం ఇటీవల విడుదల చేసింది. సుచిత్ర గతంలో రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పలు చిత్రాల్లో నటించింది.

ఆ పుస్తకంలో ఆమె చెప్పిన వివరాలు ప్రకారం....ఓ సారి సుచిత్రా రామ్ గోపాల్ వర్మకు పెళ్లి ప్రపోజల్ చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ వర్మ ఓ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్‌తో వర్మ ఆమెను కలిసి షాకింగ్ కామెంట్స్ చేసాడు. వర్మ అలా మాట్లాడటంతో షాకైన సుచిత్ర.....తన మనసులోని ఉద్దేశ్యాలను వర్మ నిర్మొహమాటంగా చెప్పినందుకు సంతోషపడిందట.
'సుచిత్రా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. మన ఆలోచనలు, దృక్ఫథాలు ఒక్కటి కావు, ఎప్పటికీ కాలేవు. నాకు వివాహ బంధంపై నమ్మకం లేదు. నేను మహిళలను కేవలం సెక్స్ కోసమే ఉపయోగించుకుంటాను. నేను కేవలం మహిళల శరీరాలనే ఇష్టపడతాను వారి మెదడును కాదు' అంటూ ఆమెతో చెప్పాడు.


Click it and Unblock the Notifications











