Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ గోపాల్ వర్మకు పోలీసుల పంచ్.. నాకే ఇంకో కూతురుంటేనా.. షాకింగ్ రిప్లై
ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. బీర్ బాటిళ్లు ఓపెన్ చేసి హంగామా చేయడం, రోడ్డుపై హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడ్ చేయడం లాంటి పనులు చేసిన వర్మ.. వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి మరింత రచ్చ చేశాడు. అయితే వర్మ చేసిన ట్రిపుల్ రైడ్ పై హైదరాబాద్ పోలీసులు ఆయనకు దిమ్మతిరిగే పంచ్ విసరడం, ఆ వెంటనే దీనిపై వర్మ డిఫెరెంట్ గా స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు, వర్మ మధ్య అసలేం జరిగింది? వివరాల్లోకి పోతే..
హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్‌తో
ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు హెల్మెట్ లేకుండానే దర్శకులు అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి మోటార్ బైక్‌పై ట్రిపుల్ రైడ్‌తో శ్రీరాములు థియేటర్‌కు వెళ్లారు వర్మ. ఆ తర్వాత వరుస ట్వీట్లతో అలజడి సృష్టించాడు. సిటీ మొత్తంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదు? బాహుశా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తూ ఉండి ఉంటారు.. అంటూ పోలీసుల మీద తనదైన శైలిలో సెటైర్ వేస్తూ ట్రిపుల్ రైడ్ పిక్ షేర్ చేశాడు వర్మ.
|
హైదరాబాద్ పోలీసుల రియాక్షన్
రామ్ గోపాల్ వర్మ ట్రిపుల్ రైడ్ ట్వీట్ చూసిన హైదరాబాద్ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ వాహనానికి రూ.1300 జరిమానా విధించారు. అంతేకాదు రామ్ గోపాల్ వర్మకు దిమ్మతిరిగేలా ఆయనను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ''ట్రాఫిల్ ఉల్లంఘనలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు రామ్ గోపాల్ వర్మకు థాంక్స్. మీరు వ్యక్తిగతంగా కూడా అంతే బాధ్యతతో ఉండాలని కోరుకుంటున్నాం. అన్నట్టు మరో విషయం.. థియేటర్లలో ఎందుకు? బయట రోడ్లపై ఇలాంటి డ్రామాలు (వర్మ ట్రిపుల్ రైడింగ్) సర్కర్ లు నిమిషానికొకటి చూస్తుంటాం'' అని పంచ్ వేశారు.
|
వర్మ మాత్రం ఊరుకుంటాడా..? వెంటనే
వర్మ అంటేనే ఓ సంచలనం. అలాంటిది తనపైనే పంచ్ వేస్తే వర్మ మాత్రం ఊరుకుంటాడా..? వెంటనే రిటర్న్ పంచ్ విసిరాడు. ''హైదరాబాద్ పోలీస్.. ఐ లవ్ యూ.. మీరు చేస్తున్న పనికి మీకు 39 రోజుల పాటు నాన్‌స్టాప్ గా ముద్దులు పెట్టాలని అనిపిస్తోంది. నాకే గనక ఇంకో కూతురు ఉంటే కచ్చితంగా నీకే ఇచ్చి.. అల్లుడిని చేసుకునేవాన్ని'' అని డిఫెరెంట్ స్టైల్ లో స్పందించాడు వర్మ.
ఇస్మార్ట్ శంకర్ సునామీ
మరోవైపు జూలై 18న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిత్రంలో రామ్, నిధి అగర్వాల్, నభ నటేష్ అభినయం ఆకట్టుకుంటోంది. పూరీ జగన్నాథ్ టేకింగ్ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తోంది.