Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్‌కు భయపడి ఆ బౌలర్‌పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
అప్సర రాణి క్రేజ్ చూసి వర్మ నోరెళ్లబెట్టాడు.. ఆ విషయంలో థ్రిల్లింగ్ షాక్
వర్మ స్టైలే వేరు. హీరోయిన్లను పరిచయం చేసే దగ్గరి నుంచి తన సినిమాలను ప్రమోట్ చేసే వరకు ప్రతీది భిన్నంగా ఉండేలా చూసుకుంటాడు. తెలుగు ప్రేక్షకులకు ఇంతకు ముందే పరిచయం ఉన్న హీరోయిన్ అయినా.. మళ్లీ పేరు మార్చి కొత్తగా పరిచయం చేశాడు. అయితే ఈ సారి మాత్రం వర్మ ఆమెలోని అందాలతో అందరికీ వల వేశాడు. పేరు దగ్గర్నుంచి మొత్తం రూపురేఖలే మార్చేశాడు. అంతకు ముందు రెండు సినిమాలు చేసినా గానీ ఎవ్వరికీ అంతగా తెలియలేదు. అయితే వర్మ పరిచయం చేశాక ఆమె పాపులార్టీ ఓ రేంజ్లో పెరిగిపోతోంది. అందుకు ఓ నిదర్శనమే ఈ వార్త. అదేంటో ఓ సారి చూద్దాం.
టాలీవుడ్ ఎంట్రీ..
అప్పర రాణి అసలు అంకితా మహారాణా. ఈమె ఊల్లాలా ఊల్లాలా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం బెడిసి కొట్టింది.4 లెటర్స్ అనే మరో మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అది కూడా బోల్తా కొట్టింది. అయితే సినిమాలు బోల్తా కొట్టినా.. ఆమె అందాలు మాత్రం వర్మ దృష్టిలో పడ్డాయి.
పేరు మార్పు..
వర్మ చాలా రోజుల క్రితమే ఆమెకు ఆఫర్ ఇచ్చినా.. అది ప్రస్తుతం వర్కౌట్ అయింది. మొత్తానికి పాత పేరును తీసేసే.. అప్సర రాణిగా మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడు. థ్రిల్లర్ సినిమాతో ఈ సారి అప్సరను ఓ రేంజ్లో చూపించబోతోన్నాడు.
విపరీతమైన క్రేజ్..
తన తదుపరి చిత్రం థ్రిల్లర్ అని, అందులో కొత్త హీరోయిన్ అప్సర రాణి అంటూ కొన్ని పోస్టర్లను వదిలాడు. ఇక అంతే ఆమె క్రేజ్ అమాంతం పెరుగుతూ వచ్చింది. గంట గంటకు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. వర్మ, ఈ హీరోయిన్ల ముద్దుముచ్చట్లు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.
Recommended Video
నాలుగు రోజుల్లోనే..
అయితే తాజాగా అప్సర ఓ ట్వీట్ చేసింది. తన బాధను వెల్లగక్కింది. నాలుగు రోజుల్లోనే తన పేరు మీద 50కి పైగా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయని.. ఓ వైపు బాధగా ఉన్నా, అదంతా తనపై ప్రేమతోనే చేశారని చెప్పుకొచ్చింది. దీనికి వర్మ వాట్.. అంటూ నోరెళ్ల బెట్టాడు. అది ప్రేమ కాకపోతే ఇంకేంటి మిస్ ఏంజిల్ అంటూ ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు.