నా ఫ్రెండ్ ఇంటికి వస్తే.. 9 ఏళ్ల వయసులోనే అలా.. మామూలోడు కాదంటూ నిజాలు బయటపెట్టిన వర్మ సోదరి

తెలుగులో రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. తెలుగులో శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేసిన ఆయన తనదైన టెక్నిక్స్ వాడుతూ సినిమాల ట్రెండ్ మార్చి ఒకప్పుడు అందరికీ ఆదర్శంగా మారారు. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ ఆయన ఇప్పుడు కేవలం వివాదాస్పద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రేక్షకుల మీద ఆయనకు ఆసక్తి తగ్గిందో లేక ఆయన సినిమాల మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిందో చెప్పలేం కానీ ఆయన నుంచి చెప్పుకోదగ్గ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ మీద దృష్టి పెట్టి సిన్మాలు చేస్తున్నారు. అయితే ఆయనకు ఆడవాళ్ళ పిచ్చి అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా ఆ విషయం మీద ఆయన సోదరి ఆసక్తికరంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

శివతో వచ్చి

శివతో వచ్చి

1989లో నాగార్జున హీరోగా శివ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ మొదటి సినిమాతోనే తెలుగు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర కూడా వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన క్షణక్షణం, అంతం, రాత్రి, గాయం లాంటి సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ఆడవాళ్ళ పిచ్చి అంటూ

ఆడవాళ్ళ పిచ్చి అంటూ

అయితే ఆడవాళ్ళ విషయంలో వర్మ చాలా క్లారిటీగా ఉంటారు. వాళ్ల దగ్గర నుంచి మనకు కావాల్సింది ఏమిటి ? వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏమిటి ? లాంటి విషయాల్లో చాలా క్లారిటీగా ఉంటారు ఆయన. కాబట్టి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు ఉండవు, రావు. అయినా సరే ఆయనకు ఆడవాళ్ళ పిచ్చి అంటూ మాట్లాడే వాళ్ళు కోకొల్లలు. అయితే ఈ విషయం మీద అయన సోదరి స్పందించారు.

కుటుంబానికి షాకిచ్చాడని

కుటుంబానికి షాకిచ్చాడని

వర్మ సోదరి విజయలక్ష్మి ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన మాటలు, లాజిక్ తో అందరిని ఆశ్చర్య పరిచే వర్మ 9 ఏళ్ల వయసులో కుటుంబానికి షాకిచ్చాడని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి వర్మ భిన్నంగా ఆలోచించేవారని, అసలు ఎవరికీ అర్థం అయ్యేవాడు కాదని పేర్కొంది.

తొమ్మిదేళ్ల వయస్సులో

తొమ్మిదేళ్ల వయస్సులో

తొమ్మిదేళ్ల వయస్సులో తన లాజిక్ తో ఇంట్లో వాళ్లను ఆశ్చర్యపరిచాడని పేర్కొంది. ఓసారి మా మామయ్యతో కలిసి నేను, అన్నయ్య సినిమాకు వెళ్లామని అయితే తిరిగి వచ్చాక మామయ్యతో ట్రైన్‌ను బ్లాస్ట్ చేసేందుకు కొందరు రైలు పట్టాలపై టైం బాంబ్‌ను ఏర్పాటు చేశారు కదా అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు డైరెక్టర్ టైమ్ బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడని, అలా చిన్నప్పటి నుంచే అన్నయ్య ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, లాజికల్‌గా థింక్ చేయడం ప్రారంభించాడని ఆమె ప్పుకొచ్చారు.

Recommended Video

RGV : బాహుబలి లెవల్ బెగ్గింగ్.. Ys Jagan మహాబలి | Tollywood Vs Ap Govt | Filmibeat Telugu
నా ఫ్రెండ్ తో

నా ఫ్రెండ్ తో

ఆర్జీవి అమ్మాయిల పిచ్చోడు అనే అంశం మీద విజయలక్ష్మి స్పందిస్తూ ‘చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెతో నీ కళ్లు చాలా బాగున్నాయి అని చెప్పేడని, అది విని నేను షాక్ అయ్యానని పేర్కొన్నారు. దానికి మెల్లకన్ను, నీకు ఎలా నచ్చింది అని అడిగితే దానికి అన్నయ్య ‘అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అనేశాను' అని చెప్పాడని అన్నారు. ఆయన అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వారితో మిస్ బిహేవ్ చేసింది లేదని ఆమె పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X