మెగా హీరోల్లో అతడే మగాడు.. అల్లు ఫ్యామిలీని కెలికిన ఆర్జీవి.. అర్ధరాత్రి తప్పతాగి ట్వీట్
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతూ వార్తల్లో నిలువడం కొత్తేమీ కాదు. తాజాగా అల్లు అరవింద్ కుమారులను ఉద్దేశించి వర్మ కామెంట్లు విసిరారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ సినిమాల్లోకి ఎందుకు రాలేదనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ సెటైర్ వదిలాడు. అయితే ఆయన చేసిన కామెంట్ తిరగబడింది. మెగా ఫ్యాన్స్ వర్మపై దారుణంగా విరుచుకుపడ్డారు. వారేమన్నారంటే

అల్లు బాబీని కలిశాను
అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీని ఇటీవల కలుసుకోవడం జరిగిందట. ఆ సందర్భంగా బాబీని చూసి ఇంప్రెస్ అయ్యాడట. దాంతో ఆయనను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అల్లు బాబీ చూడటానికి చాలా బాగా ఉన్నాడు. మెగా స్టైలీష్ పవర్ ఫ్యామిలీలో అతడేమీ తక్కువ కాదు. మెగా, అల్లు అరవింద్ ఫ్యామిలీలో ఉన్న హీరోల్లో మగాడిలా కనిపించాడు అని ఆర్జీవి ట్వీట్ చేశాడు.

మెగా హీరోల్లో ప్రతిభకు తక్కువ
అల్లు బాబీని ఇప్పుడే కలిశాను. ఆయన వెండితెర మీదకు ఎందుకు రాలేదని షాక్ కలిగింది. మెగా హీరోల్లో ప్రతిభకు ఏ మాత్రం తక్కువ లేదనిపించింది. స్టైలిష్ హీరోల కంటే ఏ మాత్రం తక్కువ కాదు అని వర్మ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ వర్మను చెండాడితే.. ఆర్జీవీ ఫ్యాన్స్ మాత్రం మరో రకంగా స్పందించారు.

ఆర్జీవికి నెటిజన్ల ఝలక్
వర్మ కామెంట్‌పై ఒకరు స్పందిస్తూ.. ‘ఆర్జీవీ హిందీ, తెలుగు సినిమాల్లోని హీరోలను చూసి దడుసుకొని ఉంటారు. అందుకే స్క్రీన్‌కు దూరంగా ఉన్నాడనుకొంటా' అని ఒకరు. ‘అల్లు ఫ్యామిలీ, మెగా హీరోల గురించి ఎందుకు.. ముందు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయి. ఆ తర్వాత ఇలాంటి ట్వీట్లు చాలా పెట్టుకోవచ్చు' అని మరొకరు ట్వీట్లు చేశారు.

వెండి తెరపై మళ్లీ మరో మెగా హీరోనా?
తెలుగు సినిమా పరిశ్రమలోకి మళ్లీ ఓ మెగా హీరోనా? బయట ఎందరో చూడటానికి మంచిగా.. ప్రతిభ ఉన్న యువకులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి అవకాశాలు ఇచ్చి ఆదరిద్దాం అని నెటిజ్ సూచించాడు. ‘రాత్రి మూడు గంటలకు ట్వీట్ అంటే.. తాగిన మత్తులో పెట్టాడనుకొంటా. మెగా కాపు క్రికెట్ టీమ్‌లో అల్లు బాబీ డ్రింక్స్ బాయ్ అని కొందరు నెటిజన్లు వర్మ కామెంట్‌కు సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











