twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టర్ పిచ్చోడు అయుండాలి లేదా ఫ్రాడ్ అయ్యుండాలి.. రామ్ గోపాల్ వర్మ అనుమానం

    |

    ధనుంజయ్ హీరోగా ఐరా మోర్ హీరోయిన్ గా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌నలోఅభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మించిన చిత్రం భైర‌వ‌గీత‌. లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ మాదాపూర్ లో హై లైఫ్ పబ్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేమిటంటే..

    భైరవగీత నాకు స్పెషల్ మూవీ

    భైరవగీత నాకు స్పెషల్ మూవీ

    చిత్ర స‌మ‌ర్ప‌కుడు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ.. భైర‌వగీత నాకు చాలా స్పెష‌ల్ మూవీ. ఇన్నేళ్ల‌లో నేను ఎన్నో సినిమాల‌ను డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. డైరెక్ష‌న్ అంటే ఓవరాల్ ఎఫెక్ట్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ ఉన్న మెటీరియ‌ల్‌ను ఉప‌యోగించి సినిమాటిక్‌గా యాంగిల్‌లో మార్చేవాడే డైరెక్ట‌ర్ అని భావ‌న‌ అని వర్మ వెల్లడించారు.

    <strong>పెద్ద డైరెక్టర్ పిల్లల సినిమా తీస్తే.. కుర్ర డైరెక్టర్ అడల్ట్ మూవీతో.. 2.0, శంకర్‌పై వర్మ సెటైర్</strong>పెద్ద డైరెక్టర్ పిల్లల సినిమా తీస్తే.. కుర్ర డైరెక్టర్ అడల్ట్ మూవీతో.. 2.0, శంకర్‌పై వర్మ సెటైర్

    సిద్ధార్థ అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా

    సిద్ధార్థ అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా

    కొన్ని సీన్స్ ను పేప‌ర్ మీద రాసేట‌ప్పుడు ఎలా ఉంటుంది. దాన్ని సినిమాగా డైరెక్ట‌ర్ ఎంత ఎక్కువ‌, త‌క్కు వ ఎఫెక్ట్‌తో డైరెక్ట్ చేశాడ‌నే దానిపై దాని లైఫ్ ఆధార‌ప‌డి ఉంటుంది. సిద్ధార్థ తాతోలు అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా నా ద‌గ్గ‌ర ఏదో ఓ సినిమాకు ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో త‌ను ఎడిటింగ్‌కు సంబంధించి విలువైన స‌ల‌హాలు ఇచ్చేవాడు. త‌ను ఇంటెలిజెంట్‌ అని వర్మ పేర్కొన్నారు.

    త‌న‌లో స్పార్క్ నాకు నచ్చింది

    త‌న‌లో స్పార్క్ నాకు నచ్చింది

    ఓసారి క‌డ‌ప వెబ్ సిరీస్ చేయ‌డానికి ఆఫీస్‌లో డిస్క‌స్ చేస్తూ ఉంటే, సిద్ధార్థ ఆ ట్రైల‌ర్‌ను నేను చేస్తాన‌ని చెప్పి చేశాడు. త‌న‌లో స్పార్క్ అప్పుడు నాకు న‌చ్చింది. సినిమాలో సీన్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఉంటుంది. సిద్ధూ అస‌లు ఎలా చేస్తాడ‌నే డౌట్ ఉండేది. నువ్వు నిజంగా చేయ‌గ‌లుగుతావా! అని కూడా అడిగాను అని వర్మ తెలిపారు.

    సిద్ధార్థ గురించి ఆర్జీవీ

    సిద్ధార్థ గురించి ఆర్జీవీ

    ఎవ‌రైనా చేయలేని ప‌నిని చేస్తాన‌ని చెబుతున్నారంటే వాడు ఫ్రాడ్ అయ్యుండాలి.. లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. సిద్ధూ పిచ్చోడు కాదు.. త‌నే డైరెక్ట‌ర్ కాబ‌ట్టి ఫ్రాడ్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు ఉండ‌దు అనే న‌మ్మ‌కంతో సినిమా అవ‌కాశాన్ని ఇచ్చాను. నేను చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. కొన్ని బాగా వ‌స్తాయి. కొన్ని బాగా రావు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ర‌షెష్ చూసి నేను షాక‌య్యాను అని వర్మ పేర్కొన్నారు.

    ఎడిటింగ్ రూంలో నాకు షాక్

    ఎడిటింగ్ రూంలో నాకు షాక్

    నేను స్క్రిప్ట్ చ‌దివిన‌ప్పుడు, డైరెక్ట‌ర్‌గా నాకొక విజ‌న్ ఉంటుంది. దాన్ని బ‌ట్టి నేను అంచనాతో ఎడిటింగ్ రూమ్‌లోకి వెళితే.. నేను షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా తీయ్యొచ్చా అని కూడా అనిపించింది. అది నాకొక లెర్నింగ్ లెస‌న్‌. డైరెక్ష‌న్ అనుభ‌వం లేకుండా సినిమా చేయ‌డ‌మ‌నేది రేర్‌గా జ‌రిగే విష‌యం అని వర్మ వెల్లడించారు.

    వర్మకు నేను థ్యాంక్స్ చెప్పను

    వర్మకు నేను థ్యాంక్స్ చెప్పను

    చిత్ర దర్శకుడు సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ.. `ఇంజ‌నీరింగ్ చ‌దివిన నేను సినిమాల్లోకి వెళ‌తాను అన‌గానే.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌పోర్ట్ చేసిన నా త‌ల్లిదండ్రుల‌కు థాంక్స్‌. నా గురువుగారు రాముగారికి థాంక్స్ చెప్పి.. నాకు ఇచ్చిన అవ‌కాశాన్ని చిన్న‌దిగా చేయ‌డం నాకు ఇష్టం లేదు. హీరో ధ‌నుంజ‌య‌ను ఈ సినిమాతో భైర‌వ అని పిలుస్తారు. హీరోయిన్‌తో అంద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. న‌న్ను న‌మ్మి, నాతో ప‌నిచేసిన అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

    English summary
    Young director Siddharth awaits his debut with the film Bhairava Geetha that will be released in three languages. The film has been made in Telugu and Kannada. The film was supposed to be released on November 23, but has now been postponed to November 30. In this occassion, movie pre release function organised in Hyderabad. RGV speaks about Director Siddhartha talent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X