For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఆ పార్టీ పెద్దను గట్టిగానే తగులుకున్నాడే!

  |

  ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సరికొత్త సంచలనాలు క్రియేట్ చేయడంలో వర్మను మించిన మనిషే ఉండరు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇక ఈ మధ్యకాలంలో అయితే వర్మ దూసుకుపోతున్న తీరు సినీ, రాజకీయ వర్గాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసి ఓ పార్టీ వర్గానికి చుక్కలు చూపిన వర్మ.. మళ్ళీ అదే బాటలో వెళ్తుండటం హాట్ టాపిక్ అయింది.

  మరోసారి రంగంలోకి వర్మ.. చుక్కలు చూపిస్తూ

  మరోసారి రంగంలోకి వర్మ.. చుక్కలు చూపిస్తూ

  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించారు వర్మ. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిన ఆయన తిరిగి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ రంగంలోకి దిగారు. నిజానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒక్కటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా ఈ సినిమా అప్‌డేట్స్ ఇస్తూ ఓ వర్గం పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు.

  వీలు చిక్కినప్పుడల్లా బాణం..

  వీలు చిక్కినప్పుడల్లా బాణం..

  వీలు చిక్కినప్పుడల్లా బాణం అన్నట్లుగా ఉంటున్నాయి రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అప్‌డేట్స్. సరిగ్గా సమయం చూసి మరీ గురి పెడుతూ అప్‌డేట్స్ వదులుతున్నారు ఈ వివాదాస్పద డైరెక్టర్. ఈ నేపథ్యంలోనే నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్బంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

  మనవడిని కూడా వదలని వర్మ

  మనవడిని కూడా వదలని వర్మ

  ఇటీవలే 'పప్పులాంటి అబ్బాయి' పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ.. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ పార్టీకి చెందిన అధినేత మనవడిని కూడా వదల్లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా వివాదాలు ఎంతలా ఉంటాయో ఊహించడమే అసాధ్యం అనిపిస్తోంది.

  వర్మ ఇంకెన్ని బాణాలు విసురుతారో మరి

  వర్మ ఇంకెన్ని బాణాలు విసురుతారో మరి

  తాత, తండ్రితో కలిసి పిల్లడు ఆడుకుంటున్నట్లు ఉన్న పోస్టర్‌ను బాలల దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు ఈ అప్‌డేట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. చూడాలి మరి విడుదలకు లోపే వర్మ.. ఇంకెన్ని బాణాలు విసురుతారో.

  కాంట్రవర్సీ లేదంటూనే.. మరో అడుగు

  'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే తాను ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చెలామణి అనుకోవడం లేదని చెబుతూ వస్తున్నాడు వర్మ. పైగా విడుదల చేసిన ప్రతీ పోస్టర్, ప్రతీ పాటపై ఇది ఎవరినానైనా పోలి ఉందని భావిస్తే అది పూర్తిగా మీ అభిప్రాయం అని చెప్తున్నాడు. దీంతో వర్మ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.

  Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెన్సేషన్స్

  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెన్సేషన్స్

  ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. రాజకీయ వర్గాలను కుదిపేస్తూ వర్మ విడుదల చేస్తున్న అప్‌డేట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.

  English summary
  Ram Gopal Varma aka RGV revealed that he has received numerous threat calls from unidentified people from foreign destinations after he announced his new film Kamma Rajyam Lo Kadapa Redlu. Now he released special poster on the occasion of childrens day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X