For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వర్మ ఒళ్ళో కూర్చున్న హాట్ బ్యూటీ.. కొత్త కారుతో ఆమె జీవితాన్నే మార్చేసిన ఆర్జీవి!

  |

  విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి పని చేసినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఉండదు. ఒకప్పుడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆర్జివి ఇప్పుడు మాత్రం గ్లామరస్ బ్యూటీలతో బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తూ సరికొత్త షాక్ ఇస్తున్నాడు. ఒకవిధంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న దర్శకులు సైతం షాక్ అవుతున్నారు అనే చెప్పాలి. ఇక వర్మ తనకు నచ్చిన దారిలోనే డిఫరెంట్ గా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటున్నాడు. వర్మ ఇటీవల ఒక బ్యూటీ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. అయితే దీనికంటే ముందు మరొక హాట్ బ్యూటీ హైలెట్ చేస్తూ సినిమాలు చేసిన వర్మ చాలా తక్కువ కాలంలోనే ఆమెను హైలెట్ చేశాడు. ఆమెతో ఒక ఫోటో దిగిన వర్మ మళ్లీ హాట్ టాపిక్ గా నిలిచాడు.

  అవేమీ పట్టించుకోకుండా

  అవేమీ పట్టించుకోకుండా

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని మరోసారి నిరూపించుకున్నాడు. వెండితెరపై ఆయన సక్సెస్ చూసి చాలా కాలం అయింది. కానీ అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా రిజల్ట్ తో సంబందం లేకుండా విబిన్నంగా ఫిలిమ్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓటీటీ ప్రపంచంలో కూడా సరి కొత్త బిజినెస్ మొదలు పెట్టారు. రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం సినిమాలకంటే కూడా తన ఇంటర్వ్యూలతోనే సోషల్ మీడియాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు.

  తెలివిగా నడుచుకునే వర్మ

  తెలివిగా నడుచుకునే వర్మ

  రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడితో సినిమా చేయాలని చాలామంది నటీనటులకు ఎంతో ఆశగా ఉంటుంది. ఒకప్పుడు ఆయన ఎలాంటి వివాదాస్పదమైన కథను సెలెక్ట్ చేసుకున్న కూడా ఇందులో నటించడానికి అగ్ర నటీనటులు కూడా ముందుకు వచ్చేవారు. ఎందుకంటే ఏం జరిగినా కూడా వర్మ బ్యాలెన్స్ చేస్తాడనే నమ్మకం అందరికీ ఉండేది. చట్ట పరమైన వివాదాలు తలెత్తకుండా చాలా తెలివిగా ఆలోచించే వర్మ ఇప్పుడు మాత్రం సరికొత్త పంథాలో నడుస్తున్నాడు.

  శృంగార తారతో

  శృంగార తారతో

  ఇక సినిమా ప్రపంచంలో ఎక్కువగా లైమ్ లైట్ లోకి రాని గ్లామర్ బ్యూటీ లపై వర్మ స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే శృంగార తార మియా మాల్కోవా తో కూడా సినిమా చేసిన రాంగోపాల్ వర్మ ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా GST మూవీ ని విడుదల చేశాడు. ఆ తర్వాత ఎక్కువగా అప్సరా రాణితో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలు ఓటీటీలోనే ఎక్కువగా విడుదలయ్యాయి.

  వర్మ ద్వారా లక్కీ ఛాన్స్

  వర్మ ద్వారా లక్కీ ఛాన్స్

  ఒక విధంగా రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఫోటోలతో కూడా అప్సర రాణి ఎక్కువగా హైలెట్ అయ్యింది. ఆమెతో థ్రిల్లర్ డేంజరస్ అనే సినిమాలను చేసిన విషయం తెలిసిందే. ఇక ఆమె అందాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేసిన వర్మ ఆమె కెరీర్ కు ఒక విధంగా చాలా బాగా హెల్ప్ అయ్యాడని చెప్పవచ్చు. వర్మ దగ్గరకు వచ్చిన కొన్ని రోజులకే క్రాక్ సినిమాల్లో ఆమెకు ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చింది. బూమ్ బద్దలు అనే ఆ సాంగ్ భారీ స్థాయిలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

  కొత్త కారు కొన్న అప్సర

  కొత్త కారు కొన్న అప్సర

  ఇక ఆ తర్వాత అప్సర ప్రత్యేకంగా ఒక కారును కూడా కొనుగోలు చేసింది. నిజానికి ఆమె పేరు అప్సర కాదు. అంకెత మహారాణా అనే పేరును వర్మనే చేంజ్ చేశాడట. ఇక ప్రస్తుతం ఆమెకు మీడియం రేంజ్ అవకాశాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. ఐటమ్స్ సాంగ్స్, స్పెషల్ గ్లామర్ రోల్స్ అంటూ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతోంది. అయితే ఎంత బిజీగా మారినప్పటికీ ఆమె మాత్రం రాంగోపాల్ వర్మ కు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్లు అర్థమవుతోంది. అప్పుడప్పుడు దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

  ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వర్మ

  ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వర్మ


  ఇక ఇటీవల అప్సర రాణిని రాంగోపాల్ వర్మ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఇక పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే ఫోటో వైరల్ కావడం విశేషం. నరకం, స్వర్గం ఒళ్ళో కూర్చున్నట్లు.. నేను దేవతతో దేయ్యంలా పోజు ఇచ్చాను అంటూ వర్మ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశాడు. అంతేకాకుండా అక్షరానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోలు కూడా షేర్ చేసుకున్నాడు.

  అషు రెడ్డి కూడా..

  అషు రెడ్డి కూడా..

  అప్సర రాణి అనంతరం ఇటీవల అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన రామ్ గోపాల్ వర్మ ఆమెకు మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. ఇక ఇప్పుడు అషు రెడ్డితో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాడు. చూస్తుంటే అషు రెడ్డి కూడా అప్సర రాణి తరహాలోనే ఫోకస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  English summary
  Ram gopal varma special bold posing with apsara rani,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X