గజిని సూర్య ద్వారా అమీర్ ఖాన్ పై పగతీర్చుకొంటున్నా రామ్ గోపాల్ వర్మ...!
అమీర్ ఖాన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ 'రంగీలా" వంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన విషయం విదితమే. ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అవకాశం దొరికినప్పుడల్లా అమీర్ ఖాన్ పై నోరుపారేసుకుంటుంటాడు రాము. తాజాగా 'రక్తచరిత్ర2" పోస్టర్స్ లో 'ఇట్స్ సూర్య ది గజనీ" అని ముద్రించాడు రామ్ గోపాల్ వర్మ. 'గజిని" ద్వారా సూర్యకి మంచి ఫేమ్ వచ్చింది.
అలాగే హిందీ 'గజిని" సంచలనాత్మక వసూళ్లు కురిపించింది. ఈ చిత్రం అమీర్ ఖాతాలో మంచి కమర్షియల్ ఫిలింగా కూడా నమోదయ్యింది. కానీ 'గజిని" అంటే..సూర్యనే అని అర్థం వచ్చేట్టు రామూ పోస్టర్స్ వేశాడు. అంటే..అమీర్ కి సీన్ లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు రాము. ఆ రకంగా అతని మీద ఉన్న పగని కాస్తంత తీర్చుకున్నాడు రాము.
More from Filmibeat
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సూర్య అమీర్ ఖాన్ గజినీ రంగీల ప్రియమణి ram gopal varma rakta charitra surya aamir khan ghajini rangeela priyamani


Click it and Unblock the Notifications











