లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు కారణం బాలకృష్ణ.. అందుకే ఆయనకు అంకితమిస్తున్నా.. భయపడే సమస్యేలేదు.. వర్మ
Recommended Video

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంంగా తెరకెక్కుతున్న లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రం ప్రమోషన్ భారీగా మొదలైంది. సింహగర్జన పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోసాని కృష్ణమురళి, పృథ్వీ, లక్ష్మీపార్వతి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..

లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనుక బాలకృష్ణ
మగవాడి సక్సెస్ వెనుక ఓ ఆఢది ఉంటారంటారు. అలాగే ప్రతీ సినిమాకు ఇన్సిపిరేషన్ ఇవ్వడానికి ఓ వ్యక్తి ఉంటాడు. ఓ వ్యక్తి తారసపడి, నీ జీవితంలోకి వచ్చి ఓ ఐడియా ఇస్తుంటారు. ఆ వ్యక్తి ఈ సినిమాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ వ్యక్తికే ఈ సినిమాను అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. దానికి వెనుక పెద్ద కథ ఉంది. ఇప్పుడు దానిని చెప్పుకోవడం అప్రస్తుతం.

లక్ష్మీస్ ఎన్టీఆర్ నాకు చాలా స్పెషల్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నా కెరీర్‌కు స్పెషల్. నాకు ఈ సినిమా కథపై అవగాహన లేదు. 1995లో ఎన్టీఆర్‌ను పదవీచుత్యుడిని చేసే సమయంలో నేను రంగీలా సినిమా షూట్ చేసుకొంటూ ముంబైలో ఉన్నాను. ఈ సినిమా చేసే సమయంలో ఎంతోమందిని నేను కలిశాను. నిజాయితీతో చెప్పిన కొందరి మాటల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

రెండు గంటల్లో చూపించడం కష్టం
రియలిస్టిక్ బయోపిక్ చేయడానికి నిజాయితీ ఉండాలి. నాలుగున్నర ఏళ్ల ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య ఉన్న వైవాహిక జీవితాన్ని తెరకెక్కించడం, దానిని రెండున్నర గంటల్లో చూపించడం కష్టమైన పనే. అయినప్పటికీ ఆగస్త్య మంజు, నేను చేసిన ప్రయత్నం సఫలమైందనే అనుకొంటున్నాను.

బాలయ్యతో అలాంటి విభేదాలే
ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వం వహించే అవకాశాన్ని బాలకృష్ణ ఇచ్చి ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వచ్చి ఉండేది కాదు అనే విషయం కరెక్ట్ కాదు. ఎందుకంటే బాలకృష్ణతో కథా చర్చలు జరిగినప్పుడు లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లేకపోతే నేను సినిమా తీయను అని చెప్పాను. అందుకే నేను తీయనని చెప్పాను.

బెదిరింపులకు భయపడను
టెలివిజన్ మీడియాలో చర్చ సందర్భంగా నాకు బెదిరింపులు వచ్చాయి. అయితే ఎవరి బెదిరింపులకు నేను భయపడను. భయపడితే ఇలా మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వచ్చి ఉండేది కాదు. బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. బెదిరింపులు ఓ స్టంట్ కూడా కాదు.


Click it and Unblock the Notifications











