'జై సమైక్యాంధ్ర' అంటున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
రాష్ట్రంలో రగులుతున్న సమైఖ్యాంద్ర,తెలంగాణ ఇష్యూలపై మొదటిసారిగా నోరు విప్పారు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఈ విషయమై ఓ పత్రికా ప్రకటన చేసారు. అందులో..'రాజకీయాలు, సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల గురించి నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా ఉండాలని రాజగోపాల్ ప్రగాఢంగా నమ్ముతున్నారంటే దానిని నేను కూడా నమ్ముతున్నాను' అని ఆయన పేర్కొన్నారు. 'నేను, లగడపాటి' పేర ఆయన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. చివరలో 'జై సమైక్యాంధ్ర' అని లేఖను ముగించారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో తనకు జూనియర్ అయిన ప్రస్తుత ఎంపీ రాజగోపాల్ తో అనుబంధం గుర్తు చేసుకున్నారు. తాను రాజ్ గోపాల్ ని మొదటిసారి చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న అనుబంధాన్ని ఆయన లేఖలో తెలిపారు. ఒకసారి రాజగోపాల్ కాలేజీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు ఎందుకు ఎన్నికల్లో దిగుతున్నావు అని అడిగితే..'ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదు, కానీ పదవి ఉన్నపుడు సమస్యల్లో ఉన్న ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండవచ్చు' అని లగడపాటి సమాధానం ఇచ్చారనీ, ఆయన ఇచ్చిన సమాధానం అందులో స్పష్టత చూసి ఆశ్చర్య పోయానని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లగడపాటిని టీవీలో చూశానని 25 ఏళ్ల నాటి రాజగోపాల్‌ను చూసినట్లుందని పేర్కొన్నారు. లగడపాటి కళ్లలో అదే నిజాయతీ, జిజ్ఞాస, ధైర్యం, ద్రుఢత్వం ఇప్పటికీ ఉన్నాయని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు.ఇక రామ్ గోపాల్ వర్మ తొలి సంచలనాత్మక చిత్రం శివ..సిద్దార్ధ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగానే తయారు చేసుకున్నట్లు వర్మ ఎప్పుడూ చెప్తూండటం తెలిసిందే.


Click it and Unblock the Notifications











