twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళికి కేవలం 2 గంటల్లో 1000 కోట్లు.. RRR కోసం షాకిచ్చేలా వర్మ స్ట్రాటజీ

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం RRR. ఈ చిత్రాన్ని జక్కన ప్యాన్ ఇండియా మూవీగా మలిచే ప్రయత్నంలో ఓ తపస్సు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ప్లాన్ చెప్పారు. ఆర్జీవి చెప్పిన ప్లానింగ్ చాలా అందర్నీ షాక్ కలిగించేలా ఉంది. వర్మ చెప్పిన స్ట్రాటజీ ఏమిటంటే..

    వర్మ ఓటీటీ ప్రయోగం

    వర్మ ఓటీటీ ప్రయోగం

    కరోనావైరస్ కారణంగా సినిమా హాళ్లు మూతపడి చిత్ర పరిశ్రమ ఓ రకమైన షాక్‌లో ఉంటే రాంగోపాల్ వర్మ తన బుర్రకు పదునుపెట్టి తనదైన శైలిలో క్లైమాక్స్ అనే సినిమాను లాక్‌డౌన్‌లో తెరకెక్కించారు. జీఎస్టీ ఫేం మియా మాల్కోవాతో రూపొందించిన క్లైమాక్స్ సినిమాను ఓటీటీలో ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

    క్లైమాక్స్‌కు అనుహ్యమైన స్పందన

    క్లైమాక్స్‌కు అనుహ్యమైన స్పందన

    ఆర్జీవి వరల్డ్ థియేటర్లలో రిలీజైన క్లైమాక్స్ చిత్రాన్ని 12 గంటల్లో 1.68 లక్షల మంది చూశారు. యూజర్ల కెపాసిటీని ఆపలేక సర్వర్ క్రాష్ కావడంతో సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నారు. తాము 50 వేల మంది చూస్తారని ఊహించామని, అయితే దాదాపు 2 లక్షల మంది చూడటంతో మా అంచనాలు తప్పాయని చెప్పారు.

    ఓటీటీలో సినిమాలకు అనూహ్య స్పందన

    ఓటీటీలో సినిమాలకు అనూహ్య స్పందన


    క్లైమాక్స్ సినిమాకు వచ్చిన అద్బుతమైన స్పందనపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సినిమా ఎక్కడ చూశామనే విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సినిమా ఎలా తీశామన్న విషయాన్ని అసలే పట్టించుకోవడం లేదు. కంటెంట్ బాగుందా అనే విషయాన్ని ఓటీటీలో చూస్తున్నారు. ఓటీటీలో ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్‌లు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడానికి ప్రేక్షకుల స్పందనే ప్రధాన కారణం అని అన్నారు.

    RRR సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే

    RRR సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే

    ఓటీటీలో తాను అనుసరించిన ఫార్ములానే రాజమౌళి పాటిస్తే RRR సినిమాకు రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం. ఎందుకంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు కిలో మీటర్ దూరం క్యూలైన్లు కట్టి టికెట్లు కొన్నారు. వారం రోజులు హౌస్‌ఫుల్ అయితే ప్రేక్షకులు వెయిట్ చేసి సినిమాను చూశారు. అదే బాహుబలిని ఓటీటీలో చూస్తే ఒకే సమయంలో కోటి మంది కూడా చూడటానికి అవకాశం ఉండేది. టికెట్ ధర 100 పెట్టినా కోటి మందికి ఎంత డబ్బు వచ్చేదో ఊహించడం కష్టం అని వర్మ పేర్కొన్నారు.

    రెండు గంటల్లోనే..

    రెండు గంటల్లోనే..

    ఇక RRR సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫాం రిలీజ్ చేసి టికెట్ ధర సుమారు 1000 రూపాయలు పెట్టారనుకో.. పది మంది కలిసి ఆ మొత్తానికి టికెట్ కొని చూసే అవకాశం ఉంటుంది. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూసే వాళ్లు సినిమా రిలీజైన కేవలం రెండు గంటల్లోనే చూస్తేస్తారు. కేవలం ఆ రెండు గంటల్లోనే రాజమౌళికి రూ.1000 కోట్లు వచ్చే అవకాశం లేకపోలేదు అని వర్మ గణాంకాలు వేసి చెప్పారు.

    Recommended Video

    RRR Movie Update : SS Rajamouli Serious On Shriya Saran
    ఖర్చులన్నీ మిగిలిపోతాయి.

    ఖర్చులన్నీ మిగిలిపోతాయి.

    RRR సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే ఒకవేళ ఆ చిత్రం 1000 కోట్లు వసూలు చేస్తే ఖర్చులు అన్నీ పోను కేవలం 500 కోట్లు మాత్రమే వస్తాయి. ఎందుకంటే థియేటర్ కిరాయి, ఇతర ఖర్చులన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఇలాంటి ఖర్చులు ఉండవు. డైరెక్టుగా ప్రేక్షకుడి నుంచి రాజమౌళి లేదా నిర్మాత అకౌంట్లకు డబ్బు చేరిపోతుంది. మధ్యవర్త అనే కాన్సెప్టే ఉండదు అని వర్మ చెప్పారు.

    English summary
    Ram Gopal Varma strategy to SS Rajamouli about RRR release. RGV has shared his views RRR's expected collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X