ఆమెపై కుళ్లు కామెంట్లు: రామ్ గోపాల్ వర్మకు చివాట్లు!
ఎప్పుడూ ఏదో వివాదాలు, వెకిలి చేష్టలు, సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...తాజాగా మరోసారి తన వెకిలి బుద్దికి పని చెప్పాడు. ఓ ఉన్నత స్థాయి మహిళపై కుళ్లు కామెంట్లు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులతో ఛీ కొట్టించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే... ప్రముఖ అమెరికన్ స్టార్, ప్రపంచ ప్రఖ్యాత చాట్ షో రూపకర్త ఓఫ్రా విన్ ఫ్రేపై వర్మ తన ట్విట్టర్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఓఫ్రా విన్ ఫ్రే అంటే చేపనా? అంటూ కామెంట్లు చేశాడు.
ఓఫ్రా ఉన్న స్థాయికి... తొక్కలో రామ్ గోపాల్ వర్మను పట్టించుకునే అవకాశం లేక పోయినా వర్మ లాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం బాధ కలిగించిందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్మకు గోరోజనం కాస్త ఎక్కువే అంటూ చివాట్లు పెడుతున్నారు. ఒక ఉన్నత స్థాయి మహిళ, స్టార్ మీద ఇలాంటి రెడిక్యులస్ వ్యాఖ్యలు చేయడం వర్మ లాంటి వ్యక్తులకు గౌరవప్రదం కాదని కొందరంటుంటే....పబ్లిసిటీ కోసం వర్మ ఇలాంటి టింగరి వేషాలు వేయడం మామూలే అని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు.
తన కొత్త షో చిత్రీకరణలో భాగంగా ఓఫ్రా ప్రస్తుతం ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓఫ్రా రాక సంగతి తెలుసుకుని బచ్చన్ కుటుంబం మొత్తం కట్టకట్టుకుని వెళ్లి ఆమెకు స్వాగతం పలికి తొలుత తమ ఇంటికి రప్పించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఏమిటో.


Click it and Unblock the Notifications











