పవన్‌పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్‌పై సారీ చెప్పను అంటూ!

డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించిన కొత్తలో గొప్ప గొప్ప చిత్రాలనే చేసినా.. ఈ మధ్య కాలంలో మాత్రం ఎన్నో వివాదాల్లో తల దూర్చుతూ కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియా వేదికగా కొందరు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్న అతడు.. సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తూ గొడవలకు కారణం అవుతున్నాడు. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్న వర్మ.. పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించాడు. కానీ, ఇప్పుడు దీనిపై యూటర్న్ తీసుకున్నాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

ఫలించని ఆర్జీవీ వ్యూహం:వైఎస్ జగన్ కథతో రూపొందిన చిత్రమే 'వ్యూహం'. ఈ సినిమా అనుకున్న విధంగా టాక్‌ను తెచ్చుకోలేదు. ఫలితంగా ఈ మూవీని చూసేందుకు ఆడియెన్స్ కరువు అయ్యారు. ఇలా నాలుగైదు రోజులు ప్రదర్శించినా దీనికి కలెక్షన్లు మాత్రం దక్కలేదు. ఫలితంగా 25 కోట్ల రూపాయలతో తీసిన ఈ చిత్రం జీరో షేర్ మూవీగా మిగిలింది. దీంతో 'శపథం' చిత్రాన్ని ఓటీటీలో వదిలారు.

Ram Gopal Varma Takes Uturn On Contest Against Pawan Kalyan in Pithapuram

పిఠాపురంలో పోటీ చేస్తా:ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాంగోపాల్ వర్మ ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జనసేనాని వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు. ఆ వెంటనే రాంగోపాల్ వర్మ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తానని ట్వీట్ చేశాడు.

సంతోషంగా చెబుతున్నా:సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాంగోపాల్ వర్మ గురువారం సాయంత్రం X (ట్విట్టర్) ఖాతాలో 'ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం.. నేను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను. ఇది మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీంతో పవన్ కల్యాణ్‌ను వర్మ మరోసారి టార్గెట్ చేశారన్న విషయం అర్థం అయింది.

Ram Gopal Varma Takes Uturn On Contest Against Pawan Kalyan in Pithapuram

అంతా పబ్లిసిటీ స్టంటే:సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అదే సమయంలో ఆయన నిజంగానే పోటీ చేస్తున్నాడని అంటే చాలా మంది నమ్మలేదు. పైగా ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌లో భాగం అని కామెంట్లు చేశారు. అయితే, ఓ వర్గం మాత్రం రాంగోపాల్ వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడని అనుకున్నారు.

యూటర్న్ తీసుకుంటూ:పిఠాపురంలో పోటీ చేస్తానని చెప్పిన రాంగోపాల్ వర్మ తాజాగా దీనిపై యూటర్న్ తీసుకున్నాడు. ఈ మేరకు X (ట్విట్టర్) ఖాతాలో దీనిపై క్లారిటీ ఇస్తూ... 'నా ట్వీట్‌ను తప్పుగా చదివి అర్థం చేసుకున్న వాళ్ల కోసం.. నేను పిఠాపురంలో జరగబోతున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో పాల్గొనబోతున్నాను. త్వరలోనే షూట్ చేయబోతున్నాను ఇదే నా ట్వీట్ ఉద్దేశం' అని చెప్పుకొచ్చాడు.

నేను సారీ చెప్పనంటూ:ఇదే ట్వీట్‌లో రాంగోపాల్ వర్మ 'నేను అలా ట్వీట్ చేసినందుకు అస్సలు చింతించను. ఎందుకంటే నేను నా ట్వీట్‌లో ఎన్నికలు అనే పదాన్ని ఉపయోగించలేదు. మీడియానే ఊహాగానాలతో అందరినీ తప్పుదారి పట్టించింది' అని చెప్పుకొచ్చాడు. దీనిపై చాలా మంది ముందే ఊహించాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X