twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దొంగలముఠా’షూటింగ్ కి అయిన ఖర్చు ఎంతంటే...

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'దొంగలముఠా".కేవలం ఐదు రోజుల్లో తీసిన ఈ చిత్రం ట్రైలర్స్ ని హైదరాబాద్ సినిమాక్స్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఈ చిత్రం కి అయిన బడ్జెట్ ని వర్మ రివిల్ చేసారు. వర్మ మీడియాతో మాట్లాడుతూ...ఈ సినిమాకి ఆరున్నర లక్షలు ఖర్చయింది. ఈ చిత్రం ఒక్క షో ఆడినా అది హిట్టే. వంద రోజులు షూటింగ్ ఎందుకు తీస్తున్నామో అర్థ్ధమైతే ఐదురోజుల్లో ఎలా తీసామో అర్థమవుతుంది. కేనన్ 5 కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్ చేసాం. టెక్నికల్‌గా అనేక మార్పులు ఉన్నా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆహ్వానించినా సినిమా టెక్నీషియన్లు త్వరగా ఆహ్వానించలేకపోతున్నారు అన్నారు.

    అలాగే... ఐదురోజుల్లో ఈ చిత్రాన్ని నిర్మించింది గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడానికి కాదు. ఇలాంటి చిత్రాలు టెక్నికల్‌గా చేయాలనీ, తక్కువ టైమ్‌తో చేయవచ్చునని చూపించడానికి చేసాను. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఐదుగురు కెమెరామెన్‌లు, నేను, నా అసిస్టెంట్ తప్ప మరెవరూ లేరు. ప్రతి సీను ఐదు ఏంగిల్స్‌లో తీసాం. సెట్‌లోకి ఎవరూ రాలేదు. సౌండ్‌ను కెమెరానే రికార్డు చేసింది. ఈ చిత్రానికి ఉపయోగించిన కెమెరాలు చాలా చిన్నవి. ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. వీటి ప్రాముఖ్యత తెలియజేస్తూ తక్కువ ఖర్చుతో చిత్రాన్ని నిర్మించాలని ఈ ప్రయోగం చేసాను. త్వరలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి తమ తీర్పు తెలియజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో రవితేజ, సుబ్బరాజు, అల్లు శిరీష్, హరీష్ శంకర్ పాల్గొన్నారు.

    English summary
    Ram Gopal Varma’s Dongala Muta Shooting Completed . He is creating a new record in Telugu film history by shooting a movie in 5 working days with a cast that consists of well-known stars.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X