ఉదయం 5.30కు రవితేజకు చెప్పాను ..ఓకే అన్నాడు
దొంగల ముఠా ఆలోచన తెల్లవారుజామున వచ్చింది.వెంటనే 5.30కు రవితేజకు చెప్పాను. 6.30కు ఓకే అన్నాడు. కొన్ని గంటల్లోనే కార్యరూపం దాల్చింది. ఏదైనా నాకు నచ్చిన సినిమాలే తీయగలను. ఒక్కోసారి ఉదయం పుట్టిన ఆలోచన సాయంత్రానికి మారిపోతుంది.ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతుంటాయి అంటూ వర్మ దొంగల ముఠా చిత్రం గురించి చెప్పారు. అలాగే తక్కువ రోజుల్లో తీసారు కదా..ఎలా సాధ్యమైంది అన్నదానికి సమాధానంగా...తక్కువ, ఎక్కువ అనేది తీస్తున్నదానిపై దర్శకుడికి ఉండే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషులో 'గ్లాడియేటర్' సినిమాను 45రోజుల్లో తీశారు. నాకు తెలిసి కెమెరామెన్ సరిగ్గా తీయలేకపోతే సినిమా ఆలస్యమవుతుంది. లేదంటే స్క్రిప్ట్ రెడీకాక పోవటం. నటీనటుల వల్ల ఆలస్యమనేది ఎప్పుడూ ఉండదు అన్నారు. "దొంగలముఠా" చిత్రం షూటింగ్ మొదటే చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తి చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 4, 2011 న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అంటే కేవలం సినిమా ప్రారంభించిన రోజు నుంచి 23 రోజుల్లోనే విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











