బ్రహ్మానందంతో అనుబంధం గుర్తు చేసుకున్న రామ్ గోపాల్ వర్మ
"బ్రహ్మానందంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 'అహ నా పెళ్లంట'లో నటిస్తున్నప్పుడు నేను అవకాశాల కోసం అక్కడికి వెళ్లేవాడ్ని. 'మనీ', 'అనగనగా ఓ రోజు' నుంచి ఇప్పుడు 'కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - అప్పల్రాజు' సినిమా వరకూ ఆ అనుబంధం కొనసాగుతోంది. వాళ్లబ్బాయి గౌతమ్ కథానాయకుడు కావడం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తన శిష్యుడు పూరీ జగన్నాధ్ తో కలిసి బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'వారెవా' చిత్రం ప్రొమోలు రిలీజ్ చేసారు. ఇక ఈ చిత్రంలో శాంభవి హీరోయిన్. మహి స్వీయ దర్శకత్వంలో సినిమాని నిర్మించారు.
రామ్ గోపాల్ వర్మ మనీ అనగనగా ఓ రోజు అప్పల్రాజు వారెవా మహి brahmanandam gowtham ram gopal varma appalaraju mahi money


Click it and Unblock the Notifications