'అది తప్పు...నాకు పది కిలోల పొగరుంది'...రామ్ గోపాల్ వర్మ
'వాంటెడ్' చిత్రంలో 'అరకిలో పొగరు, అరకిలో బలుపు' అనే పాట ఉంది. నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారన్నారు. అది తప్పు. నాకు పది కిలోల పొగరుంది అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన రీసెంట్ గా గోపీచంద్, దీక్షా సేథ్ జంటగా నటించిన చిత్రం 'వాంటెడ్' చిత్రం ఆడియో పంక్షన్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే దర్శకుడు రవి సినిమా బాగా తీశాడని నమ్మకం ఉందన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న రవి మంచి సినీ విమర్శకుడు. మేం తీసిన సినిమాల్లో లోపాలను కరక్టుగా ఎత్తిచూపించేవాడు. కాబట్టి తన సినిమాను జాగ్రత్తగా తీసుంటాడని భావిస్తున్నాను. పాటలు బాగున్నాయి. తప్పకుండా సినిమా విజయం సాధించాలి అన్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వెనిగళ్ల ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రచయిత బీవీఎస్ రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. చక్రి సంగీతం సమకూర్చారు. దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు. దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నె రవి, కూర్పు: శంకర్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్.


Click it and Unblock the Notifications











