twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "శివ" కాంబో మళ్ళీ రిపీట్: నవంబర్ 20 నుంచే వర్మ, నాగార్జున సినిమా మొదలు

    నవంబర్ 20 నుంచి అక్కినేని నాగార్జునతో కొత్తసినిమా షూటింగ్ ప్రారంబిస్తున్నానంటూ సోషల్‌మీడియా ద్వారా తెలిపాడు వర్మ. అంతేకాదు ముహూర్తపు షాట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్లాన్ చేశానంటూ పేర్కొన్నాడు.

    |

    Recommended Video

    RGV- Nagarjuna New Film Details "శివ" కాంబో మళ్ళీ రిపీట్

    నాగార్జున, రామ్‌గోపాల్ వర్మ ఈ రెండు పేర్లకూ విడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ లాంటి "శివ" అటు వర్మనీ, నాగార్జుననీ వాళ్ళతో పాటు తెలుగుసినిమా ఫార్మేట్ నీ మార్చి పడేసింది. ఆ సినిమా విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త దర్శకులకు ఓ నిఘంటువులాంటిదని చెప్పాలి.

    దర్శకునిగా పరిచయం చేశాడు

    దర్శకునిగా పరిచయం చేశాడు

    రాంగోపాల్‌ వర్మ టాలెంట్‌ని గమనించి ఆ సినిమాతో దర్శకునిగా పరిచయం చేశాడు నాగార్జున. అసలు సెంటిమెంట్లు ఉండని వాడు అనుకునే వర్మ ఈ విషయం లో నాగార్జునకి మాత్రం "థాంక్ యు నాగ్ ఆ రోజు నువ్విచ్చిన అవకాశం వల్లే నేనిలా ఉన్నాను" అంటూ కన్నీళ్ళతో చెప్పాడు...

     మరీ పెద్ద హిట్ కాదు

    మరీ పెద్ద హిట్ కాదు

    అదే కాంబినేషన్‌లో శివ తరవాత చేసిన "గోవిందా గోవిందా" మాత్రం అదే టైటిల్ ని రిపీట్ చేస్తూ వెళ్ళిపోయింది.ఆ తర్వాత ‘అంతం' సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా ప్రశంసలు అందుకుంది గానీ మరీ పెద్ద హిట్ కాదు ఇక ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి పని చేయలేదు. కానీ మిత్రులుగా కలిసే ఉన్నారు.

     'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కంటే ముందే

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కంటే ముందే

    అలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇరవైఅయిదేళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా రాబోతోంది... ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను రూపొందించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కంటే ముందే నాగార్జునతో ఓ సినిమా చేస్తానని ప్రకటించిన వర్మ.. తాజాగా ఇందుకోసం ముహూర్తం ఖరారు చేశాడు.

     ముహూర్తపు షాట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో

    ముహూర్తపు షాట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో

    నవంబర్ 20 నుంచి అక్కినేని నాగార్జునతో కొత్తసినిమా షూటింగ్ ప్రారంబిస్తున్నానంటూ సోషల్‌మీడియా ద్వారా తెలిపాడు వర్మ. అంతేకాదు ముహూర్తపు షాట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్లాన్ చేశానంటూ పేర్కొన్నాడు. అంతకుముందు చాలాకాలం క్రిందట వర్మ-నాగార్జున కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం 'శివ' కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ప్రారంభించాం అని వర్మ గుర్తుచేయడం విశేషం.

    English summary
    Ram Gopal Varma also went on to elaborate that it will be an action film. Nagarjuna has done more family-oriented films of late so it will be interesting to see him in a complete action film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X