నటుడుగా రామ్ గోపాల్ వర్మ
దర్శకుడుగా ఎన్నో సంచలనాలు సృష్టించిన వర్మ తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు కూడా రాబోతున్నారు. తెరపై నటుడిగా మరో కోణాన్ని ఆవిష్కరించనున్నాడు. 'ముఝే రామ్ జీ సే మిల్నా హై' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. వర్మను నటుడిగా పరిచయం చేసే అవకాశాన్ని దర్శకుడు అదీప్ సింగ్ దక్కించుకున్నారు.ఇక ఈ చిత్ర కథ సీనీ పరిశ్రమలోని లోని చీకటి కోణాలను స్పృశిస్తూ ఉంటుందని తెలుస్తోంది. ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే వారు ఎలాంటి వంచనలకు గురవుతున్నారనేది ఈ చిత్రంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది. బాలీవుడ్ లో ఒక స్థాయికి చేరుకునేందుకు తాను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడో తెలియజెప్పే పాత్రలో వర్మ కనిపించబోతున్నారు. ప్రస్తుతం వర్మ రూపొందించిన 'రణ్', 'అజ్ఞాత్'(తెలుగులో 'అరణ్యం') చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ram gopl varma director actor rann siva bollywood aranyam nitin ముఝే రామ్ జీసే మిల్నా హై రామ్ గోపాల్ వర్మ అదీప్ సింగ్ రణ్ అజ్ఞాత్


Click it and Unblock the Notifications