వర్మ మరీ ఇంత దారుణమా? అప్సర రాణి, థ్రిల్లర్ ఫోటోషూట్ చూస్తే మతిపోవాల్సిందే (ఫోటోలు)
వర్మకు నియమాలు, నిబంధనలు, పరిధులు అనేవి ఉండవు. అసలు అలాంటివి లేనివాడే ఆర్జీవీ అవుతాడు. తాను ఏది అనుకుంటే అది మాత్రమే చేసే దుడుకు స్వభావం. కరోనా ఇంతలా విజృంభిస్తూ ఉంటే తెరపై రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కించకూడదని అంతా ఫిక్స్ అవుతున్న సమయంలో.. వర్మ ఓ బాంబ్ వేశాడు. అంతకంతకు వేడి పుట్టించేలా హత్తుకుని ఉన్న స్టిల్స్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వర్మ థ్రిల్లర్
రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ సమయంలోనే క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను రూపొందించాడు. ఆపై పవర్ స్టార్, థ్రిల్లర్ సినిమాలను ప్రకటించాడు. ఈ రెండూ శర వేగంగా షూటింగ్లను జరుపుకుంటోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌తోనే నానా రచ్చ చేస్తున్నాడు.

అప్పర క్రేజ్ అమాంతం..
ఊల్లాలా ఊల్లాలా, 4 లెటర్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అయితే ఆ చిత్రాలు బెడిసి కొట్టాయి కానీ సినిమాలు బోల్తా కొట్టినా.. ఆమె అందాలు మాత్రం వర్మ దృష్టిలో పడ్డాయి. అందుకే పేరు మార్చి మరీ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ప్రజెంట్ చేయబోతోన్నాడు. వర్మ పరిచయం చేయడంతో ఒక్కసారి క్రేజ్ పెరిగిపోయింది.

కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్స్..
అయితే తాజాగా అప్సర ఓ ట్వీట్ చేసింది. కుప్పలు తెప్పలుగా ఫేక్ అకౌంట్స్ ఏర్పడటంపై తన బాధను వెల్లగక్కింది. నాలుగు రోజుల్లోనే తన పేరు మీద 50కి పైగా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయని.. ఓ వైపు బాధగా ఉన్నా, అదంతా తనపై ప్రేమతోనే చేశారని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.

అప్సరకు థ్యాంక్స్..
ఒడిషా గురించి తెలిసి వచ్చేలా చేసిన అప్పరకు థ్యాంక్స్ అని వర్మ చెప్పుకొచ్చాడు. ఒడిషాలోని మరో టాలెంట్ నటుడిని కనిపెట్టానని, అప్సరకు జోడిగా రాక్ కచ్చి అనే అతడిని ఫిక్స్ చేశానని తెలిపాడు. ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందినవారు కావడం కూడా విశేషం.

హాట్ స్టిల్స్‌తో దడ..
వర్మ తాజాగా వీరిద్దరి స్టిల్స్‌ను షేర్ చేశాడు. కరోనా సమయంలో ఇలాంటి సీన్లను తీయోద్దని అంతా భావిస్తుంటే వర్మ మాత్రం ఒకింత అడుగు ముందుకేసినట్టు కనిపిస్తున్నాడు. వీరిద్దరి ఘాడంగా హత్తుకునే సన్నివేశాలు ఇలా ఉంటే సినిమా మొత్తం ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











