RGV తల నరికితే కోటి బహుమానం.. టీడీపీ నేతపై రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం.. పవన్‌ను లాగుతూ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై టీడీపీ అనుకూల నేత, అమరావతి పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో వ్యూహం సినిమాపై జరిగిన చర్చలో ఆర్జీవిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో వర్మ తీసుకొన్న సంచలన నిర్ణయం వివరాల్లోకి వెళితే..
Recommended Video

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో కొలికపూడి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వాళ్లకు కోటి రూపాయలు ఇస్తాను అంటూ బహిరంగ ప్రకటన చేశారు. లైవ్‌లో కోలికపూడి చేసిన వ్యాఖ్యలను హోస్ట్ సాంబశివరావు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే నేను అలానే రిపీట్ చేస్తానని ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉండటం వీడియోలో కనిపించింది.

అయితే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తన కాంట్రాక్టు కిల్లింగ్‌కు ప్రోత్సాహం ఇస్తున్న కొలికపూడి మాటలను ఖండించారు. ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని ఆయన అభ్యర్థించారు.
ఇక తనను చంపి తలను తెచ్చి ఇస్తే కోటి రూపాయల బహుమానం ఇస్తానని బహిరంగ ప్రకటన చేసిన కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ను ప్రశ్నించారు. మీరు కొలికపూడి వ్యాఖ్యలను ఖండించకపోతే మీరు ఆయనను సమర్ధిస్తున్నట్టు భావిస్తున్నారా? అంటూ ఆర్జీవి నిలదీశాడు. అంతేకాకుండా ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించాడు.
తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావుపై తాను విజయవాడలో కేసు నమోదు చేస్తున్నాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. అలాగే 3.30 గంటలకు పోలీసులను కలిసి టీవీ5 యాంకర్ సాంబశివరావు, ఆ చానెల్ ఓనర్ బీఆర్ నాయుడుపై కూడా కేసు నమోదు చేస్తాను. అనంతరం మీడియాతో నేను మాట్లాడుతాను అని వర్మ తన ట్వీట్ తెలిపాడు.
ఇదిలా ఉండగా, వ్యూహం సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాను విడుదల చేయవద్దని టీడీపీ నేత లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ సినిమా అనుకొన్న తేదీకి రిలీజ్ అవుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











