twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయండి.. లేకపోతే మేమే తేల్చుకొంటాం..

    By Rajababu
    |

    Recommended Video

    Ram Gopal Varma in deep trouble రాంగోపాల్ వర్మను మేమే తేలుస్తాం

    మహిళలపై చవకబారు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై విశాఖపట్నం పోలీసులకు మహిళా సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు, స్త్రీలను చులకన భావంతో చూసినందుకు వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు అధికారులకు పిటిషన్ సమర్పించారు. వివరాల్లోకి వెళితే..

     కమిషనర్‌కు పిటిషన్ అందజేత

    కమిషనర్‌కు పిటిషన్ అందజేత

    దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్‌ను కోరుతూ విశాఖపట్నం జాయింట్ పోలీస్ కమిషనర్‌కు మహిళా సంఘాల ఐక్య వేదిక పిటిషన్ దాఖలు చేసింది. మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా వారు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తీరుపై మహిళ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

     మహిళలను వ్యాపార వస్తువులుగా

    మహిళలను వ్యాపార వస్తువులుగా

    కళల మాటున మహిళను వ్యాపార వస్తువుగా మారుస్తున్నాడు. సినిమాల పేరుతో దేశంలోని యువతను పెడదోవ పట్టిస్తున్నాడు అని వారు తమ పిటిషన్‌లో దాఖలు చేశారు. టెలివిజన్ ఛానెల్లలో చర్చల సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలను పోలీసులకు వివరించాడు.

     వైజాగ్‌లో ఆర్జీవి బహిరంగ సభ

    వైజాగ్‌లో ఆర్జీవి బహిరంగ సభ

    కాగా, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వైజాగ్‌లో బహిరంగ సభను నిర్వహిస్తానని రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన సభను అడ్డుకొంటామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు.

    అరెస్ట్ చేయకపోతే.. ఉధృతం

    అరెస్ట్ చేయకపోతే.. ఉధృతం

    మహిళల మనోభావాలను కించపరుస్తున్న రాంగోపాల్ వర్మను వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మేము మరింత ఉధృతం చేస్తాం అని మహిళా సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పిటిషన్‌పై విచారణ చేపట్టారు.

    English summary
    Director Ram Gopal Varma landed in deep trouble. Visakhapatnam Women organisations filed a case on RGV for making abusive comments against women. Mahila Sanghala Aikya Vedika of Visakhapatnam demanded the director RGV to be arrested immediately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X