రామ్ గోపాల్ వర్మ సంపాదకుడిగా పత్రిక
రణ్ టైమ్స్ అనే పత్రిక రామ్ గోపాల్ వర్మ సంపాదకత్వంలో త్వరలో రానుంది. ఈ పత్రిక పది పేజీలు ఉంటుంది.ఈ 'రణ్ టైమ్స్'ను దేశంలోని 500 మల్టీప్లెక్స్‌ల్లో ప్రేక్షకులకు ప్రతి రోజు అందించాలని అనుకుంటున్నారు. దాదాపు 3 లక్షల సర్య్కులేషన్‌తో దీన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రాజకీయ, క్రీడ, సామాజిక, మానవీయ వార్తలతోపాటు సినిమా కబుర్లూ ఉంటాయి. అయితే ఈ పత్రికను ఎల్లకాలం ప్రచురించనని అంటున్నారాయన. సినిమా విడుదలయ్యే వరకూనే ఈ పత్రిక ప్రచురణ కొనసాగిస్తారు.తాజాగా ఆయన రూపొందించిన 'రణ్' సినిమా ప్రచారంలో భాగంగా ఈ పత్రికను వెలువరిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆయన ఇలాంటి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఇక వర్మ 'రణ్' చిత్రం మీడియాకు, సామాన్య జనానికి మధ్య సాగే కథతో రూపొందించిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారి గా చేసిన ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











