'బిజినెస్ మ్యాన్' హిందీ వెర్షన్ గురించి వర్మ
మహేష్ తో పూరీ జగన్నాధ్ రూపొందించిన 'బిజినెస్‌మేన్' సూపర్ హిట్ కావటంతో ఈ చిత్రం హిందీ వెర్షన్ కి రంగం సిద్దమవుతోంది. ఈ విషయం రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ తో నిర్దారించారు. ఆయన తానే నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారు. ఈ విషయం ఆయన ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం పూరీ జగన్ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని హిందీ ఆడియన్స్ సెన్సిబులిటీస్ కు అణుగుణంగా రీరైట్ చేస్తున్నారు. పూరీ నాతో హిందీ బిజినెస్ మ్యాన్.. తెలుగు కన్నా పది రెట్లు బెటర్ గా ఉంటుంది అని చెప్పారు.
అలాగే నేను ఈ చిత్రాన్ని నేను నిర్మించబోవటంతో చాలా ధ్రిల్లింగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం పూరీకే దక్కుతుంది. అతను హిందీ వెర్షన్ కోసం చెప్పుతున్న మార్పులు, ట్రీట్ మెంట్ వింటూంటే గ్యారెంటీగా హిందీలో పెద్ద హిట్టవుతుందనిపిస్తోంది. ఈ చిత్రం అండర్ వరల్డ్ సినిమాలకు మదర్ లా తయారవుతుంది అనిపించింది. ఇక ధీరూభాయ్ అంబానీ తను వ్యాపారం కాకుండా ముంబై మాఫియాలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా కథ తయారవుతోంది అని ట్వీట్ చేసారు. మరో ప్రక్క పూరీ ఈ చిత్రం ఈ రేంజి విజయం సాధించటంపై చాలా ఆనందంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











