ఓటుకు నోటుపై వర్మ ట్వీట్లు: కేసీఆర్‌‌కు శిరస్సు వంచి వందనం

By Bojja Kumar

హైదరాబాద్: ఓ వైపు రాష్ట్రంలో ఓటుకు నోటు వ్యవహారం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇప్పటికే విచారణ నిమిత్తం జైల్లో గడుపుతుండగా.... టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేసీఆర్ ముక్కుసూటి పోకడలపై వర్మ ప్రశంసలు గుప్పించారు. అదే సమయంలో చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పించారు.

Ram Gopal Varma tweet about Cash for Vote scam

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పనికి తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్టను మసకబార్చారని ట్విట్టర్ లో ఆరోపించారు. కేసీఆర్ ముక్కు సూటి తననానికి తాను శిరస్సు వంచి వందనం చేస్తున్నాని అన్నారు.

రేవంత్ రెడ్డి చాలా క్రియాశీలకంగా ఉండేవాడని, దూకుడుగా పనిచేసేవాడని అనవసరంగా ఓటుకు నోటు వ్యవహారం ఇరుక్కున్నారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X