»   » రాజమౌళి మాత్రమే: చిరు ‘మెగాస్టార్’ బిరుదుపై కామెంట్స్!

రాజమౌళి మాత్రమే: చిరు ‘మెగాస్టార్’ బిరుదుపై కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదలవ్వడం, భారీగా కలెక్షన్లు కురిపిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే ఈ కామెంట్లు చిరంజీవి అభిమానులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. వర్మ చేసిన కామెంట్లు ఇలా ఉన్నాయి....

బాహుబలి కలెక్షన్లు మెగా అనే పదాన్ని మించిపోయే విధంగా ఉన్నాయి. అందువల్ల మెగాస్టార్ తన పాతబడిన టైటిల్‌ని పెంచుకునే సినిమా చేయాలి. మెగాస్టార్ అనే పేరు వచ్చింది మెగా కలెక్షన్ల మూలానే. కానీ బాహుబలి కలెక్షన్ల ప్రవాహంలో ‘మెగా'కు ఇక అర్థం లేదు. రాజమౌళి తప్ప మెగాస్టార్ 150వ సినిమాకు ఎవరూ న్యాయం చేయలేరు.

Ram Gopal Varma tweet about Chiranjeevi 150

ఒక వేళ మెగాస్టార్ తన 150వ సినిమాను ‘బాహుబలి' కంటే పెద్దగా చేయకుంటే... అది ఆయన ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దానికంటే పెద్ద మిస్టేక్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా... నేను మరియు లక్షలాది మంది ఇరత ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా బాహుబలి కంటే పెద్ద సినిమా కావాలని కోరుకుంటున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

ప్రభాస్ రాజమౌళి కలిస్తే ఆకాశం అంత ఎత్తకు మాత్రమే వెళ్లగలరు. చిరంజీవి రాజమౌళి కలిస్తే అంతరిక్షమంత ఎత్తుకు వెళ్లగలరు. ఇతర ఏ దర్శకుడు చిరంజీవి 150వ సినిమా హ్యాండిల్ చేసినా భూమి మీదకు పడిపోతుంది అంటూ మరో ట్వీట్ చేసాడు. గతంలో ఇదే రామ్ గోపాల్ వర్మ చిరంజీవి 150వ సినిమాకు పూరి తప్ప మరెవరూ బాగా తీయలేరంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడేమో రాజమౌళి తప్ప ఎవరూ పనికి రారని అంటున్నాడు. ఏమిటో ఈయన వరుస?

English summary
"If Mega star does not pitch his 150th film bigger than Bahubali it will be a bigger mistake than starting Praja Rajyam party. As the biggest fan of Mega Star me nd millions of his other fans want to see his 150th film bigger than the biggest which is Bahubali." Ram Gopal Varma tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu