»   » నచ్చలేదు, అతిగా ప్రచారం: చిరు 60వ బర్త్ డేపై వర్మ ట్వీట్

నచ్చలేదు, అతిగా ప్రచారం: చిరు 60వ బర్త్ డేపై వర్మ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు, సెటైర్లు...అప్పుడప్పుడు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా ఆయన చిరంజీవి 60వ పుట్టినరోజుపై తనదైన రీతిలో స్పందించారు. చిరంజీవి 60వ పుట్టనరోజు జరుపుకోవడం తనకు నచ్చలేదన్నారు.

‘చిరంజీవి గారూ.. మీకు అప్పుడే 60 ఏళ్లు రావడం నాకు నచ్చలేదు. మీ వాళ్లు దీని గురించి అతిగా ప్రచారం చేయడం అంతకన్నా నచ్చలేదు. అభిమానులకు మీరు ఎప్పుడూ 26 ఏళ్ల యువకుడే' అంటూ ట్వీట్ చేశారు. ‘మెగాస్టార్‌ను ఉద్దేశించి కాదు కానీ.. షష్టిపూర్తి అనేది ఓ కుటంబ పెద్దను బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించడానికి సన్నిహితులు ఏర్పాటు చేసే ఒక కుట్రలాంటిది' అంటూ ట్వీట్ చేసారు వర్మ.

Ram Gopal Varma tweet about Chiranjeevi birth day

‘నేను సాధారణంగా ఎవరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పను. కానీ మీ పుట్టుక మాకు అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకే మాకు మేమే విష్ చేసుకుంటాం' అంటూ తనదైన రీతిలో ట్వీట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.

English summary
"Chiranjeevigaru I hate it that u became 60 yrs old nd I hate it more that ur people are advertising it but u wil be forever 26 for us fans" Ram Gopal Varma tweet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu